Fake Instagram ID: చదివింది ఎల్‌ఎల్‌బీ.. అమ్మాయిల పేరుతో ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌.. బ్లాక్‌ మెయిల్ చేస్తూ డబ్బులు వసూళ్లు!

దేశంలో ఫేక్‌ గాళ్లు ఎక్కువైపోయారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో నకిలీగాళ్లకు కొదువేలేదు. ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేయడం.. తమ కార్యకలాపాలను కొనసాగించడం చేస్తున్నారు.

Fake Instagram ID: చదివింది ఎల్‌ఎల్‌బీ.. అమ్మాయిల పేరుతో ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌.. బ్లాక్‌ మెయిల్ చేస్తూ డబ్బులు వసూళ్లు!
Fake Id Cheating
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 15, 2021 | 9:20 PM

Miscreants Create Fake Social media Profile: దేశంలో ఫేక్‌ గాళ్లు ఎక్కువైపోయారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో నకిలీగాళ్లకు కొదువేలేదు. ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేయడం.. తమ కార్యకలాపాలను కొనసాగించడం చేస్తున్నారు. ఓ కేటుగాడు అమ్మాయిల పేరుతోనే ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. అమ్మాయిలకు వల వేస్తూ.. డబ్బులు వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు బాధితుల ఫిర్యాదుతో కేటుగాడి బండారం బయటపడింది.

అమ్మాయి పేరుతో ఇన్స్‌స్టాగ్రాంలో ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి యువతులను మోసం చేస్తున్న కేటుగాడిని గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని సంజీవ్ నగర్ కు చెందిన మాజీ కార్పోరేటర్ కొడుకు పూనూరి రాం ప్రకాష్ బిఏ ఎల్ఎల్‌బీ నాలుగో ఏడాది చదువుతున్నాడు. రాంప్రకాష్.. ప్రియ పేరుతో ఇన్స్‌స్టాగ్రాంలో ఏడాది క్రితం ‘ఫేక్ ఐడి క్రియేట్ చేశాడు. ఆ ఐడి నుండి అమ్మాయిలతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రాంప్రకాష్ మంచి వాడని అతనితో స్నేహం చేయాలని అమ్మాయిలకు సూచిస్తాడు. ఇలా పరిచయం అయినవారితో ఒరిజినల్ ఐడి ద్వారా అమ్మాయిలతో చాటింగ్ చేస్తాడు.

ఈ క్రమంలోనే శ్రీనివాసరావు పేటకు చెందిన ఇంటర్ విద్యార్థినితో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం కాస్త స్నేహంగా మారింది. దీంతో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల వరకు వెళ్లింది. ఇలా తన అవసరాల కోసం ఆ యువతి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టాడు. మొత్తంగా రూ.85 వేలు తీసుకున్నాడు. అనుమానం వచ్చిన యువతి అతనితో చాటింగ్ చేయడం నిలిపివేసింది. అయితే, రాంప్రకాష్ అంతటితో ఊరుకోకుండా ఆయువతికి ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని లేకుంటే యువతి చాటింగ్, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

రాంప్రకాష్ వేధింపులు భరించలేని ఆ బాలిక.. తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రాంప్రకాష్ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన నగరంపాలెం పోలీసులు రాంప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అతని వద్ద నుండి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్‌స్టాగ్రాంలో ఫేక్ ఐడి ద్వారా పరిచయం చేసుకొని యువతులను మోసం చేస్తున్నట్లు నగరంపాలెం చెప్పారు. ఇప్పటి వరకూ మూడు వందల యాభై మంది యువతులు అతని ఐడిలో ఫాలోవర్స్‌గా ఉన్నారన్నట్లు గుర్తించారు. ఫేక్ ఐడి ద్వారా పరిచయం చేసుకొని ఒరిజినల్ ఐడితో చీటింగ్ చేస్తున్నాడని సీఐ హేమారావు తెలిపారు. ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో పరిచయం ఉన్న వ్యక్తులతో మాత్రమే చాటింగ్ చేయాలన్నారు.

Read Also…  Mumbai Cop: మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుల్‌.. 50 మంది గిరిజన పేద విద్యార్థులను దత్తత తీసుకున్న రెహనా

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే