Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బావిలో పడిన 8 ఏళ్ల చిన్నారిని కాపాడబోయి 40 మంది బావిలో పడిపోయారు..

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని విదిషాలో బావిలోపడిన ఎనిమిదేళ్ల చిన్నారిని కాపాడబోయి 40 మంది బావిలో పడిపోయారు. చిన్నారిని రక్షించడానికి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బావిలో పడిన 8 ఏళ్ల చిన్నారిని కాపాడబోయి 40 మంది బావిలో పడిపోయారు..
Rescue
Follow us
uppula Raju

|

Updated on: Jul 16, 2021 | 7:15 AM

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని విదిషాలో బావిలోపడిన ఎనిమిదేళ్ల చిన్నారిని కాపాడబోయి 40 మంది బావిలో పడిపోయారు. చిన్నారిని రక్షించడానికి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం, ట్రాక్టర్‌తో సహా బావిలో పడిపోయారు. బావి దగ్గర ఉన్న గోడ కూలడంతో ఈ ప్రమదం సంభవించింది. అతికష్టం మీద 23 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా 13మంది గల్లంతయ్యారు. వీరికోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

బాలికను రక్షించే సమయంలో బావి చుట్టూ జనం గుమిగూడారని పోలీసులు తెలిపారు. ప్రజల గుంపు కారణంగా ఒత్తిడి పెరిగిపోయి బావి చుట్టు ఉన్న సరిహద్దు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 40 మంది 40 అడుగుల లోతైన బావిలో పడిపోయారు. అయితే 23 మందిని రక్షించినట్లు మధ్యప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వస్ సారంగ్ తెలిపారు. ఇందులో 13 మందిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రిలో చేర్పించామన్నారు. ఈ సంఘటనపై సీఎం శివరాజ్ సింగ్ అధికారులతో నిత్యం సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయన మంత్రి విశ్వస్ సారంగ్‌ని ఆదేశించారు. దీంతో పాటు ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దార్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.

గురువారం సాయంత్రం 8 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ బావిలో పడిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఈ వార్త గ్రామం మొత్తం వ్యాపించడంతో బావి చుట్టూ చాలా మంది గుమిగూడారు. బాలికను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జనం కారణంగా బావి సరిహద్దు అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో 40 మంది బావిలో పడిపోయారని భోపాల్ అదనపు డైరెక్టర్ జనరల్ సాయి మనోహర్ తెలిపారు. ఈ ప్రమాదంలో చిన్నారి, మిగిలిన 17 మంది పరిస్థితి గురించి ఏ వివరాలు తెలియలేదని అన్నారు. సరిహద్దు విరిగిపడటంతో చాలా మంది బావిలో పడిపోయారు. దీంతో చిన్నారి గాయపడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 23 మందిని సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద చిక్కుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sania Mirza: సానియా మీర్జాకు దుబాయ్ గోల్డెన్ వీసా.. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న భారత క్రీడాకారిణీ

Corona Third Wave: ఆగస్టు చివరిలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం: ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త

Drunken Driving: ఫుల్లుగా మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తూ.. మేడ్చల్‌లో మందుబాబు అరాచకం