Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza: సానియా మీర్జాకు దుబాయ్ గోల్డెన్ వీసా.. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న భారత క్రీడాకారిణీ

UAE Golden Visa: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. సానియా మీర్జాతోపాటు ఆమె భర్త పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్‌లకు 10 సంవత్సరాల యుఎఇ గోల్డెన్ వీసాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మంజూరు చేసింది.

Sania Mirza: సానియా మీర్జాకు దుబాయ్ గోల్డెన్ వీసా.. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న భారత క్రీడాకారిణీ
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 16, 2021 | 7:07 AM

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. సానియా మీర్జాతోపాటు ఆమె భర్త పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్‌లకు 10 సంవత్సరాల యుఎఇ గోల్డెన్ వీసాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మంజూరు చేసింది. హైదరాబాద్‌కు చెందిన మీర్జా (34), పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ స్థానికుడు మాలిక్ (39) 2010 లో వివాహం చేసుకున్నారు. పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌ను పెళ్లాడినప్పటి నుంచి దుబాయ్‌లోనే నివసిస్తు్న్నారు. ఈ క్రీడా దంపతులకు ఇజాన్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

దీర్ఘకాలిక నివాసం ఏర్పర్చుకునేందుకు గోల్డెన్ వీసాను 2019లో ప్రవేశ పెట్టింది దుబాయ్. ఇందులో  జాతీయ స్పాన్సర్ అవసరం లేకుండా యుఎఇలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ వ్యాపారం మీద 100 శాతం యాజమాన్యం హక్కులను కలిగి ఉంటారు. ఆ దేశంలో నివసించడానికి పని చేయడానికి.. అధ్యయనం చేయడానికి విదేశీయులకు వీలు కల్పించింది. ఈ వీసాలు ఐదు లేదా 10 సంవత్సరాల కాలానికి స్వయంచాలకంగా పునరుద్ధరించబడతాయి.

ఈ  గోల్డెన్ వీసా పొందిన ఇతర క్రీడాకారులలో ఫుట్‌బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ ఫిగో, టెన్నిస్ ప్రపంచ నంబర్ 1 నోవాక్ జొకోవిచ్ ఉన్నారు. వారి తర్వాత ఇలాంటి అరుదైన అవకాశన్ని సానియా మీర్జా దంపతులు దక్కించుకున్నారు. ఇక స్టార్ ఆటగాళ్లతోపాటు బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్‌తోపాటు సంజయ్ దత్‌కు ఈ గోల్డెన్ వీసాలు లభించాయి.

ఆరు గ్రాండ్‌స్లామ్‌లతో సహా 42 టైటిళ్లు గెలుచుకున్న సానియా మిర్జా.. ఒక డబ్ల్యుటిఎ సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకున్న రికార్డు ఉంది. మాలిక్ పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్, తన దేశం కోసం 35 టెస్టులు, 287 వన్డేలు ఆడాడు.

ఇవి కూడా చదవండి : Pulasa Fish: యానాంలో పులస చేప కోసం ఎగబడ్డ జనం.. ఖరీదు ఎంతో తెలుసా?

Monsoon Food Recipes: ఈ వర్షంలో సాయంత్రపు వేళ చాయ్‏తో ఈ రుచికరమైన స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయండి..