Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Third Wave: ఆగస్టు చివరిలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం: ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త

Corona Third Wave:గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసింది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌, కఠినమైన ఆంక్షలు..

Corona Third Wave: ఆగస్టు చివరిలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం: ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త
Corona Third Wave
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 16, 2021 | 6:49 AM

Corona Third Wave:గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసింది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌, కఠినమైన ఆంక్షలు తీసుకోవడం వల్ల అదుపులోకి వచ్చింది. అయితే ఆగస్టు చివరిలో దేశంలో థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అంటు వ్యాధుల విభాగం అధిపతి డాక్టర్‌ సమీరన్‌ పండా పేర్కొన్నారు. కోవిడ్‌ థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ.. దాని తీవ్రత సెకెండ్ వేవ్ స్థాయిలో ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ ఛానల్‌కు గురువారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో థర్డ్‌వేవ్‌పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు కారణాల వల్ల థర్డ్ వేవ్ రావచ్చని, కరోనా మొదటి, రెండో వేవ్‌ సమయంలో అభివృద్ధి చెందిన రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ) బలహీనపడటం, ఇమ్యూనిటీకి టోకరా ఇవ్వగలిగిన, లేదా వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉన్న వేరియంట్లు ఉనికిలోకి రావడం, కరోనా ఆంక్షలు ఎత్తివేయడంలో తొందరపాటు కారణంగా మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్ కారణం కానుందా అని ప్రశ్నించగా.. డెల్టా వేరియంట్లు రెండూ ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించాయని, వీటి వల్ల ఆరోగ్యవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపతుందని తాను భావించడం లేదన్నారు.

కఠినమైన నియంత్రణ చర్యలతో థర్డ్‌వేవ్‌ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన సూచించారు. అయితే కరోనా నిబంధనలు ప్రజలు పట్టించుకోవడం లేదని, దీని వల్ల మరింత ప్రమాదం ఉండే ఉండే అవకాశం ఉందని అన్నారు. కరోనా హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవవద్దని, కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టినా.. మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి అని సూచించారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగానే తగ్గుముఖం పట్టాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు తొలగించాయి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇంకా లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా కట్టడి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

ఇవీ కూడా చదవండి:

Covid-19: ఇది థర్డ్‌వేవ్‌ ప్రారంభ దశ.. అప్రమత్తంగా లేకుంటే భారీ మూల్యం తప్పదుః ప్రపంచ ఆరోగ్య సంస్థ

Chittoor District: ‘రా.. రమ్మని ఆహ్వానిస్తున్నారా..?’.. భయం, బాధ్యత లేవా..?.. నిర్లక్ష్యం చేస్తే, పర్యవసానాలు తీవ్రం