AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tradition: కృష్ణుడు ఆదేశిస్తే ఇంద్రుడు వింటాడు..వర్షాల కోసం శతాబ్దాల క్రితం నుంచి నిర్వహించే ప్రత్యేక వేడుక! ఎక్కడంటే..

Tradition: వర్షాల కోసం ప్రజలు ఎదురుచూడటం సహజం. వర్షపు చినుకు పడితేనే వ్యవసాయం మీద ఆధారపడి జీవించే మెజారిటీ భారతీయుల మోముల పై చిరునవ్వు వచ్చేది.

Tradition: కృష్ణుడు ఆదేశిస్తే ఇంద్రుడు వింటాడు..వర్షాల కోసం శతాబ్దాల క్రితం నుంచి నిర్వహించే ప్రత్యేక వేడుక! ఎక్కడంటే..
Tradition
TV9 Telugu Digital Desk
| Edited By: KVD Varma|

Updated on: Jul 16, 2021 | 8:05 AM

Share

Tradition: వర్షాల కోసం ప్రజలు ఎదురుచూడటం సహజం. వర్షపు చినుకు పడితేనే వ్యవసాయం మీద ఆధారపడి జీవించే మెజారిటీ భారతీయుల మోముల పై చిరునవ్వు వచ్చేది. కాలానుసారంగా వర్షాలు సరిగ్గా కురవాలని రైతులు నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. వర్షాలు కురవడం ఆలస్యం అయితే, వరుణదేవుడి కరుణ కోసం పూజలు నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా ఈ పద్ధతి ఉంది. మన దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న నమ్మకాలు.. వారు విశ్వసించే విధానాల ప్రకారం వరుణ దేవుని కోసం చేసే పూజలు ఉంటాయి. కొన్ని చోట్ల డ్రమ్ములు మోగిస్తూ వర్షాన్ని రావాలని కోరుకుంటారు. మరి కొన్ని చోట్ల రాత్రంతా కూర్చుని శ్లోకాలు చదువుతూ ఉంటారు.. ఇంకొన్ని ప్రాంతాల్లో నీళ్లలో కూచుని పండితులు యాగాలు నిర్వహిస్తారు. అలాగే రాజస్థాన్ లోని ఒక ప్రాంతంలో వర్షం కోసం ప్రత్యేకంగా పూజలు చేసే విధానం ఉంది. ఇక్కడ ఇంద్రుడు వర్షాలను కురిపిస్తాడని నమ్ముతారు. అందుకోసం శ్రీకృష్ణుడు ఇంద్రునికి ఆదేశం ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తారు. అందుకే ఆ కోణంలోనే ఈ ప్రాంత వాసులు వాన రాక కోసం తమ ప్రార్థనలు నిర్వహిస్తారు. రాజస్థాన్ లోని బాన్స్వారా జిల్లాలో జరుపుకునే ఈ వేడుకను రస్లీల అని పిలుచుకుంటారు. ఈ కార్యక్రమం ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.

ఈ ప్రాంత వాసులు శ్రీకృష్ణుని పూజిస్తారు. వర్షాలను కురిపించడం కోసం ఇక్కడి చేనేత కార్మికులు శ్రీకృష్ణుడు.. ఇంద్రదేవ్ ను ఆదేశిస్తున్నట్టుగా కళా రూపాల్ని ప్రదర్శిస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారా జిల్లా కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరోస్డియా గ్రామంలో ఈ వేడుక చేస్తారు. ఇది శతాబ్దాలుగా నిరవహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. గ్రామస్తులు ఉత్సాహంగా ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని నేత కార్మికులను ముందు ఐదుగురు గ్రామ పెద్దలు ఆహ్వానిస్తారు.

వర్షాలు ఆలస్యం అయిన సమయంలో కొబ్బరికాయలను నేత సమాజానికి పంపడం ద్వారా రాస్లీల కార్యక్రమం నిర్వహించమని ఆహ్వానం పంపుతారు. దీని ద్వారా విష్ణువును ఆహ్వానించినట్టుగా భావిస్తారు. తరువాత ఈ ప్రత్యేక సంప్రదాయం ప్రారంభిస్తారు. ఆ సమయంలో నేత సమాజంలోని కళాకారులు ఐదుగురు ఋషుల రూపంలో గ్రామానికి వస్తారు. వారిని గ్రామస్తులు పరిచయం చేసుకోమని కోరుతారు. దీనికి ప్రతిగా ఆ ఋషులు తాము దేవుని ప్రతినిధులమని చెప్పుకుంటారు. తరువాత వీరంతా వివిధ రకాలుగా దేవుని ప్రతినిధులుగా వ్యవహరిస్తూ గ్రామంలోని ఆలయాలన్నిటినీ సందర్శిస్తారు. అన్ని చోట్లా వర్షం కోసం ప్రార్ధిస్తారు.

ఇదిలా కొనసాగుతుండగా.. మరికొంత మంది నేత సమాజం సభ్యులు రాత్రంతా ప్రజల తరపున భజనలు, కీర్తనలు చేస్తారు. ఈ ప్రార్ధనలతో తల్లి జగదంబతో పాటు ఇంద్ర-ఇంద్రాణి, రాధా-కృష్ణ, గోపికలు భూమిపై నీటి అవసరాన్ని అంచనా వేస్తారని ప్రజల నమ్మకం. ఈ ప్రార్ధనలు విని నీటి అవసరాన్ని అంచనా వేసిన తరువాత శ్రీకృష్ణుడు ఇంద్రుడిని నీటిని వర్షించమని ఆదేశిస్తాడని చెబుతారు. ఈ రాస్లీలా ద్వారా నేత సమాజంలోని ప్రజలు ఇంద్రునికి నీరు లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను చెబుతారు. కృష్ణ రాజవంశంతో ఉండే సామీప్యత కారణంగా, దేవరాజ్ ఇంద్రుడు తన పిలుపును ప్రాధాన్యతతో వింటాడు. వారిని ఇబ్బందుల్లో చూసిన దేవుడు భూమిపై వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రజలు గట్టిగా నమ్ముతారు.

ఇది తరతరాలుగా వస్తున్న ప్రత్యేక సంప్రదాయం. ఇప్పటికీ దీనిని జరుపుతూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా దేవరాజ్ ఇంద్రుని ప్రసన్నం చేసుకునేందుకు రస్లీలా ఏర్పాటు చేసినట్లు గ్రామ సొసైటీ ప్రతినిధి కమలేష్ బంకర్ వివరించారు. వీరు నేత సమాజ ప్రజలను శ్రీకృష్ణుడి వారసులుగా భావిస్తారు. మధురలో నేతగా గుర్తించబడిన కులాన్ని రాజస్థాన్‌లో చేనేత కార్మికులు అంటారు. ఈ పనితీరు అంత సులభం కాదని చేనేత సమాజానికి చెందిన కొద్రా భాయ్ చెప్పారు.

Also Read: Vishnu in Combodia: విదేశంలో భారతీయ సంస్కృతిని చాటుతున్న విష్ణు దేవాలయం.. ఆ గుడిని జాతీయ జెండాపై ఉంచి గౌరవం

kanwar yatra: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కన్వర్ యాత్ర రద్దు..