Vishnu in Combodia: విదేశంలో భారతీయ సంస్కృతిని చాటుతున్న విష్ణు దేవాలయం.. ఆ గుడిని జాతీయ జెండాపై ఉంచి గౌరవం

Vishnu Temple in Combodia ఆ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది. విశాలమైంది. ఆ గుడికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ ఆలయం అనువణువు రామాయణం, మహాభారతాన్ని నింపుకుంది. అయితే ఈ దేవాలయం భారత దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఆ గుడికి భారతీయ సంస్కృతికి లింకేంటి? ఇంతకీ ఆ టెంపుల్ ఎక్కడుంది? విశిష్టత ఏమిటంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 15, 2021 | 2:00 PM

 భారత దేశం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూదేవాలయం. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అత్యంత విశాలమైన ఆలయం. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం.

భారత దేశం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూదేవాలయం. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అత్యంత విశాలమైన ఆలయం. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం.

1 / 6
  ఈ గుడి కంబోడియాకు చెందిన ఆంగ్‌కార్ వాట్‌లో ఉంది. ఇది శతాబ్దాల క్రితం నాటి సంస్కృతికి వారసత్వంగా నిలుస్తుంది. ఇక్కడ ఏడాది పొడుగునా సందర్శకుల తాకిడి ఉంటుంది. అలాంటి ఈ గుడి కంబోడియా జాతీయ పతాకంలోనూ చోటు దక్కించుకుంది. యునేస్కో గుర్తించిన వారసత్వ సంపద ఆలయాల్లో ఇది ముఖ్యమైంది.

2 / 6
  ఈ   మందిరం గోడలపై సంపూర్ణ రామాయణం ఉంది. మహాభారతం, బలిచక్రవర్తి, సముద్రమథనం, స్వర్గ నరకాలను, దేవదానవుల యుద్దం ఘట్టాలను కూడా దీనిపై అత్యద్భుతంగా చెక్కారు. పురాణేతిహాసాలకు సంబంధించిన ఎన్నో శిల్పాలు, వర్ణనలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

3 / 6
 ఈ విష్ణు ఆలయం ప్రతి అణువులో భారతీయ సంస్కృతి ఉట్టిపడుతుంది. ఇక్కడ రామనామం నుంచి శివ పంచాక్షరి మంత్రం వరకు మారుమోగుతాయి. ప్రకృతిని శివుడు ఆలింగనం చేసుకున్నట్లుండే వింత ఇక్కడ కనిపిస్తుంది..

ఈ విష్ణు ఆలయం ప్రతి అణువులో భారతీయ సంస్కృతి ఉట్టిపడుతుంది. ఇక్కడ రామనామం నుంచి శివ పంచాక్షరి మంత్రం వరకు మారుమోగుతాయి. ప్రకృతిని శివుడు ఆలింగనం చేసుకున్నట్లుండే వింత ఇక్కడ కనిపిస్తుంది..

4 / 6
1112లో  రెండో సూర్య బర్మన్‌ రాజు కాలంలో ఈ విష్ణు ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో అంకోర్‌ను యశోధర్‌పూర్‌ పేరుతో పిలిచేవారు. మేకాంగ్ నదీ తీరంలో ఉంది. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత పురాతన, విశాల మందిరం ఇది. దూరం నుంచి ఇది ఒక జైలులా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గుడి చుట్టూ నాలుగు వైపులా దాదాపు 400 అడుగుల వెడల్పు గొయ్యి ఉంది. దీనిలో ఎప్పుడూ నీళ్లుంటాయి. అందుకే గుడికి చేరుకోడానికి ఒక బ్రిడ్జిని నిర్మించారు. దీన్ని దాటితే గుడిని చేరుకోవచ్చు. గుడికి వెయ్యి అడుగుల వెడల్పైన విశాలమైన ద్వారం ఉంది.

5 / 6
ప్రకృతి సౌందర్యం ఆకట్టుకునేలా ఉన్న ఈ గుడిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి.  ఆంగ్‌కార్ వాట్‌‌లో భారతీయ మూలాలు కనిపిస్తాయి. 14వ శతాబ్దం వరకు ఇక్కడ కంబుజ్ రాజ్యం ఉండేది. 
ఆ తర్వాత దీనిపై ఆక్రమణ జరిగింది. 19వ శతబ్దం చివరి వరకు అంటే దాదాపు 600 ఏళ్ల వరకు ఈ మందిరం కనిపించకుండా పోయింది. ఓ వైజ్ఞానికుడు దీన్ని కనుగొనడంతో ఈ అద్భుతం వెలుగు చూసింది. ప్రపంచంలోనే ఈ అతిపురాతన మందిరం... ఒక్క హిందువులనే కాదు బౌద్ధ బిక్షువులను కూడా ఆకర్షించింది. ఈ గుడి అడుగడుగునా భారతీయ కళాకారుల పనితనం ఉట్టిపడుతుంది. ఇది కంబోడియాను ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలబెట్టింది. అందుకే ఆ దేశం ఈ గుడిని తమ జాతీయ జెండాపై ఉంచి గౌరవించింది. మేరు పర్వతంలాంటి ఈ విష్ణుమందిరం కంబోడియాలో ఉన్నా భారతీయత సంస్కృతిని చాటుతుంది.

ప్రకృతి సౌందర్యం ఆకట్టుకునేలా ఉన్న ఈ గుడిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఆంగ్‌కార్ వాట్‌‌లో భారతీయ మూలాలు కనిపిస్తాయి. 14వ శతాబ్దం వరకు ఇక్కడ కంబుజ్ రాజ్యం ఉండేది. ఆ తర్వాత దీనిపై ఆక్రమణ జరిగింది. 19వ శతబ్దం చివరి వరకు అంటే దాదాపు 600 ఏళ్ల వరకు ఈ మందిరం కనిపించకుండా పోయింది. ఓ వైజ్ఞానికుడు దీన్ని కనుగొనడంతో ఈ అద్భుతం వెలుగు చూసింది. ప్రపంచంలోనే ఈ అతిపురాతన మందిరం... ఒక్క హిందువులనే కాదు బౌద్ధ బిక్షువులను కూడా ఆకర్షించింది. ఈ గుడి అడుగడుగునా భారతీయ కళాకారుల పనితనం ఉట్టిపడుతుంది. ఇది కంబోడియాను ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలబెట్టింది. అందుకే ఆ దేశం ఈ గుడిని తమ జాతీయ జెండాపై ఉంచి గౌరవించింది. మేరు పర్వతంలాంటి ఈ విష్ణుమందిరం కంబోడియాలో ఉన్నా భారతీయత సంస్కృతిని చాటుతుంది.

6 / 6
Follow us