Chittoor District: ‘రా.. రమ్మని ఆహ్వానిస్తున్నారా..?’.. భయం, బాధ్యత లేవా..?.. నిర్లక్ష్యం చేస్తే, పర్యవసానాలు తీవ్రం

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. ఎంత డ్యామేజ్ చేశాయో ప్రత్యేకంగా చూశాం. ఎందరో ఆప్తుల్ని పొగొట్టుకున్నాం. వైరస్ సోకినవారిని కాపాడుకునేందుకు...

Chittoor District: 'రా.. రమ్మని ఆహ్వానిస్తున్నారా..?'.. భయం, బాధ్యత లేవా..?.. నిర్లక్ష్యం చేస్తే, పర్యవసానాలు తీవ్రం
Coronavirus
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 15, 2021 | 1:58 PM

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. ఎంత డ్యామేజ్ చేశాయో ప్రత్యేకంగా చూశాం. ఎందరో ఆప్తుల్ని పొగొట్టుకున్నాం. వైరస్ సోకినవారిని కాపాడుకునేందుకు పెద్ద యుద్దమే చేశాం. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ నిల్వలు లేక తల్లడిల్లిపోయాం. అయినా కూడా జనాలు నిర్లక్ష్యం వీడటం లేదు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే  థర్డ్ వేవ్‌ని కావాలనే ఆహ్వానించినవారం అవుతామని నిపుణులు హెచ్చరిస్తున్నా కూడా జనాలు పట్టించుకోవడం లేదు. ముప్పు తొలగిపోలేదని,  అత్యంత అప్రమత్తంగా ఉండాలని,  కేంద్రం ఆదేశించినప్పటికీ జనాల్లో భయం కనిపించడం లేదు. ఎక్కడి దాకో ఎందుకు.. వ్యాధి వ్యాప్తి ప్రభలంగా ఉన్న ఏపీలోని చిత్తూరు జిల్లాలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య విషయంలో మూడో స్థానంలో ఉంది ఈ జిల్లా.  మరణాల్లో అయితే మొదటి నుంచీ ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. అయినప్పటికీ జనం భయం, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు.

వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గుంపులు, గుంపులుగా గుమికూడుతున్నారు. నిబంధనలు పాటించినట్లు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మందకొడిగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 40 లక్షలకు పైగానే ఉంది.  ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసింది కేవంలం 14.15 లక్షల మందికి మాత్రమే. జిల్లాలో 37 మండలాల్లో యావరేజ్ కన్నా ఎక్కువగానే పాజిటివిటీ రేటు ఉందంటుంది జిల్లా యంత్రాంగం. అత్యధికంగా పూతలపట్టులో 6.3 శాతం పాజిటివిటీ రేటు ఉందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. అత్యల్పంగా పలమనేరులో 0.82 శాతం పాజిటివ్ రేటు ఉందని తెలుస్తోంది. థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. కాస్త అశ్రద్ద వహించినా కూడా ప్రాణాలకే ప్రమాదం అని గుర్తుంచుకోండి. ఎప్పుడూ మాస్క్ ధరించండి.. భౌతిక దూరం పాటించండి. చేతుల్ని రెగ్యులర్‌గా శానిటైజ్ చేసుకుంది. మీతో పాటు తోటి వారిని కూడా వైరస్ బారి నుంచి కాపాడండి.

Also Read:పాము, ముంగిసల మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారంటే..? 

 పెరుగుతున్న జికా వైరస్ కేసులు.. కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్..