AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swami Yatishwaranand: మంత్రి గారి ఘనకార్యం చూశారా..? కాలి వేలుకు ఫేస్ మాస్క్.. మండిపడుతున్న విపక్షాలు..

Face Mask Hanging on Foot: ఆయన ఒక ప్రజాప్రతినిధి.. బాధ్యతాయుతమైన శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన ఆయనే.. నిబంధనలను ఉల్లంఘించారు. సాధారణంగా నోటికి, ముక్కుకి ధరించే

Swami Yatishwaranand: మంత్రి గారి ఘనకార్యం చూశారా..? కాలి వేలుకు ఫేస్ మాస్క్.. మండిపడుతున్న విపక్షాలు..
Face Mask Hanging On Foot
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2021 | 2:02 PM

Share

Face Mask Hanging on Foot: ఆయన ఒక ప్రజాప్రతినిధి.. బాధ్యతాయుతమైన శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన ఆయనే.. నిబంధనలను ఉల్లంఘించారు. సాధారణంగా నోటికి, ముక్కుకి ధరించే ఫేస్ మాస్కును ఆయన కాలు వేలికి తగిలించి విమర్శల పాలయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారడంతో.. ఆ మంత్రిని విపక్ష పార్టీలన్నీ ఓ ఆట ఆడుకుంటున్నాయి. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంలో స్వామి యతిశ్వరానంద్ చెరకు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆయన ఓ సమావేశంలో మాస్కును ధరించలేదు. పైగా ఆ ఫేస్ మాస్కును కాలు వేలుకు తగిలించి కూర్చొని కనిపించార.

ఇండోర్‌లో జరిగిన సమావేశంలో స్వామి యతీశ్వరానందతోపాటు మరో ఇద్దరు మంత్రులు బిషన్ సింగ్ చుఫాల్, సుబోద్ యునియల్, మరో ఇద్దరు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎవ్వరూ కూడా మాస్కులు ధరించలేదు. అయితే.. మంత్రి యతిశ్వరనంద మాత్రం కాలి వేలుకు మాస్కును తగిలించి కనిపించారు. ఈ ఫొటో కాస్త బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఉత్తరాఖండ్‌లోని ప్రతిపక్షపార్టీలన్నీ యతీశ్వరనందపై విరుచుకుపడ్డాయి. కోవిడ్-19 ప్రోటోకాల్‌ను సీరియస్‌గా పాటించి.. ఆదర్శంగా నిలువాల్సిన మంత్రే ఈ రకంగా వ్యవహరించడం ఏంటంటూ కాంగ్రెస్, ఆప్ పార్టీలు విమర్శించాయి.

కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించకుండా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ మంత్రి స్వామీ యతిశ్వరనంద్‌ను పలు పార్టీల నాయకులు నిలదీశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే మార్గదర్శకాలను పాటించకపోతే ప్రజలు.. ప్రభుత్వ నిర్ణయాలను ఎలా అనుసరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read:

Kakinada Beach: మద్యం మత్తులో చక్కెర్లు.. స‌ముద్రంలోకి దూసుకెళ్లిన కారు.. చివరకు..

Cake Drugs: సైకాలజిస్ట్ నయా దందా.. కేకుల్లో డ్రగ్స్‌ పెట్టి రేవ్ పార్టీలకు సరఫరా.. విచారణలో షాకింగ్ నిజాలు