AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ కేసులు.. కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్..

Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మం

Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ కేసులు.. కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్..
Zika Virus
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2021 | 11:48 AM

Share

Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా నాలుగు మూడు కేసులు నమోదు కాగా.. మరో ఐదుగురికి జీకా వైరస్ సోకినట్లు గురువారం కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ మీడియాకు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 28 కి చేరినట్టు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ఐదుగురిలో జికా వైరస్‌ను గుర్తించినట్లు వీణా జార్జ్‌ తెలిపారు. అందులో ఇద్దరు అనయారకు చెందినవారని, మరో ముగ్గురు కన్నకుజి, పట్టొమ్‌, ఈస్ట్‌ ఫోర్టుకు చెందిన వారని వెల్లడించారు. అనయారను జికా వైరస్‌ క్లస్టర్‌గా గుర్తించామని, అక్కడి నుంచి మరో ప్రాంతానికి వైరస్‌ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. అనయారకు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో దోమలను నిర్మూలించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. అధికార యంత్రాగం సైతం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జికా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. కాగా.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో జికా వైరస్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభించారు.

జికా వైరస్‌ ఏడిస్‌ దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. జికా వైరస్‌ను 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. జికా సోకితే జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం లాంటి లక్షణాలు కనిస్తాయి. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం అంతటా ఆందోళన కలిగిస్తోంది. అయితే.. పిల్లలకు సోకితే ఈ వైరస్ వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Also Read:

RRR Movie: అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు జక్కన్న ఎంతలా కష్టపడ్డారో చూశారా? ఆకట్టుకుంటోన్న ఆర్.ఆర్‌.ఆర్‌ మేకింగ్‌ వీడియో.

Hyderabad: పాతి పెట్టి 10 ఏళ్ల అయినా చెక్కుచెదరని శవం.. బాడీపైన కట్టిన క్లాత్ కూడా పాడవ్వలేదు..! నివ్వెరపోయిన స్థానికలు