Gold and Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

బంగారం ధరల్లో మార్పులు సామాన్యుల్లో కలవరం రేపుతున్నాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి బంగారం వెండి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి..

Gold and Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
Gold Silver
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 16, 2021 | 1:52 PM

Gold and Silver price today : బంగారం ధరల్లో మార్పులు సామాన్యుల్లో కలవరం రేపుతున్నాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి బంగారం వెండి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి.. శుక్రవారం కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో శుక్రవారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 గా ఉంది. అదేవిధంగా వెండి 10 గ్రాములు రూ. 695గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,900ఉంది. వెండి 10 గ్రాములు రూ. 745గా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,480 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,480 ఉంది. వెండి 10 గ్రాములు రూ. 695గా ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,700ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,400 ఉంది. వెండి 10 గ్రాములు రూ. 695గా ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,260 ఉంది. వెండి 10 గ్రాములు రూ. 695గా ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,260 ఉంది. వెండి 10 గ్రాములు రూ. 695గా ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,260 ఉంది. వెండి 10 గ్రాములు రూ. 745గా ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,260 ఉంది. వెండి 10 గ్రాములు రూ. 745గా ఉంది.

అయితే బంగారం వెండి ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం, వెండి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ఎంత రేటు ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hero Bike: కేవలం నెలకు రూ.1794 చెల్లించి హీరో బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.. 63 కిలోమీటర్ల మైలేజీ

PM Fasal bima: ఫసల్ బీమా పథకంలో మార్పులు.. తెలుసుకోండి.. ప్రయోజనం పొందండి