AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: ఆ రోడ్లను మూసివేయకుండా ఆదేశాలివ్వండి.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కి మంత్రి కేటీఆర్ లేఖ..

Minister KTR: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేస్తుండటంతో నగర వాసులు..

Minister KTR: ఆ రోడ్లను మూసివేయకుండా ఆదేశాలివ్వండి.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కి మంత్రి కేటీఆర్ లేఖ..
Minister Ktr
Shiva Prajapati
|

Updated on: Jul 15, 2021 | 5:40 PM

Share

Minister KTR: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేస్తుండటంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కోరారు. ఈ మేరకు గురువారం నాడు మంత్రి కేటీఆర్ ఆయనకు లేఖ రాశారు. ఈ రోడ్ల మూసివేత అంశాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని ఆయన గుర్తు చేశారు. తాజాగా లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను కోవిడ్ కేసుల పేరు చెప్పి మూసి వేసిందని, ఈ చర్య కారణంగా లక్షలాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి కేటీఆర్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

మిలటరీ అధికారులు పదే పదే ఇలా రోడ్లను మూసివేయడంతో నగర ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారని కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మే, జూన్ నెలల్లో తీసుకున్న కొవిడ్ నియంత్రణ చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయని, ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగినా.. కరోనా పేరు చెప్పి తాజాగా మరోసారి రోడ్లు మూసివేయడం అత్యంత బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు. లోకల్ మిలటరీ అథారిటీ.. స్థానిక కంటోన్మెంట్ బోర్డుకి సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని మంత్రి ఆరోపించారు. కంటోన్మెంట్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 258 కి ఇది పూర్తి విరుద్ధమని మంత్రి కేటీఆర్ తన లేఖలో రాజ్‌నాథ్ సింగ్‌కు గుర్తు చేశారు. కంటోన్మెంట్ బోర్డు చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే రోడ్లు మూసివేసే ప్రక్రియ ఉండాలన్నారు. కానీ, మిలటరీ అధికారులు మాత్రం ఇష్టారీతిన అత్యంత చిన్న చిన్న కారణాలు చూపి పదే పదే రోడ్లు మూసివేస్తున్నారని అన్నారు.

గతంలో ఈ అంశాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకురావడంతో కంటోన్మెంట్ బోర్డు కి సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడరాదని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని, అయినప్పటికీ స్థానిక మిలిటరీ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని రాజ్‌నాథ్ సింగ్‌కు మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ విధంగా రక్షణ శాఖ కింద పనిచేసే అధికారులే, తమ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలను, సూచనలను పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. స్థానిక మిలిటరీ అధికారుల పరిధిలో ఉన్న రోడ్ల పైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, ఆ సమావేశంలో ఇందుకు సూచనప్రాయంగా అంగీకరించారని, ఈ దిశగా రక్షణ శాఖ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఈ లోగా మిలటరీ అధికారులు పదే పదే రక్షణశాఖ ఆదేశాలను తుంగలో తొక్కడం బాగోలేదన్నారు. రోడ్లు మూసివేయకుండా అదేశాలిచ్చి లక్షలాదిమంది హైదరాబాద్ నగర పౌరులకు ఊరట కల్పించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని మంత్రి కేటీఆర్ కోరారు.

Also read:

Telangana TDP: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు నయా స్ట్రాటజీ!.. పూర్వ వైభవం దక్కేనా?

Hyderabad City: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన కేటుగాళ్లు.. నకిలీపత్రాలతో రూ. 1.39 కోట్ల మోసం.. షాక్ అయిన బ్యాంక్ మేనేజర్..

Hyderabad Rains: పేరుకే ‘భాగ్యనగరం’.. చిన్నపాటి వర్షం పడిందో ‘బాధల నగరమే’.. ఈ సమస్యలకు కారణాలేంటంటే..