హిందూ కావ్యం రామాయణంలో శ్రీలంక గురించి ప్రస్తావన ఉంది. రామాయణ కావ్యంలో భూభాగం లంకగా వర్ణించబడిది. సాధారణంగా అంక అంటే జలావృత భూభాగం అని అర్ధం. లంకా రాజ్యాన్ని దేవశిల్పి విశ్వకర్మ ధనాధిదేవత కుబేరుడి కొరకు నిర్మించాడు. కుబేరుడు దుష్టుడైన సవతి తమ్ముడైన రానణుడి చేత రాజ్యభ్రష్టుడయ్యాడు. ఆధినిక నగరమైన వారియపోలా రావణుడికి విమానాశ్రయంగా ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది.