Sabarimala Temple: 3 నెలల తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయం.. స్వామిని దర్శించుకోవాలంటే కండిషన్స్ అప్లై

Sabarimala Temple: కేరళ లోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మాస పూజల కోసం తెరిచారు. శనివారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతినించారు. ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను దర్శనం కోసం అనుమతిస్తారు. ఈనెల 21వ తేదీ వరకూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిని ఇస్తున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 17, 2021 | 11:21 AM

కోవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్యను దేవస్థానం బోర్డు పరిమితం చేసింది. కేవలం 5 వేల మందికి మాత్రమే అనుమతిస్తున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. వర్చువల్  ద్వారా భక్తులు ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంది. ఈసారి పూజలో కేవలం 5,000 మంది యాత్రికులకు మాత్రమే అనుమతిస్తున్నారు.

1 / 5
శబరిమల కొండ మీదకు వచ్చే భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉందని దేవస్థానం బోర్డు తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్నారు.. దర్శనానికి 48 గంటల నుంచి 72 గంటల ముందు ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలని.. అలా నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

2 / 5
 దాదాపు మూడు నెలల తర్వాత నెలవారీ పూజ కోసం శుక్రవారం సాయంత్రం తెరిచిన శబరిమల ఆలయం ఐదు రోజుల తరువాత మూసివేయబడుతుంది.' నయాభిషేకం ', ' ఉదయాస్తమాన పూజ', ' కలశాభిషేకం ' ' పడిపూజ 'నెలవారీ పూజా సమయంలో నిర్వహించబడతాయి. జూలై 21 రాత్రి ఆలయాన్ని మూసివేస్తారు.

3 / 5
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం మొదటిసారిగా శనివారం ఉదయం నుంచి అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఫస్ట్ వేవ్ లో ఆలయంలోని భక్తులను మండల, మకరు విలక్కు పూజలకు పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. అయితే సెకండ్ వేవ్ కట్టడి కోసం తిరిగి మే నెల నుంచి భక్తులకు దర్శనాన్ని కేరళ ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా మూడు నెలల అనంతరం ఆంక్షలు సడలించిన నేపథ్యంలో మళ్ళీ అయ్యప్ప స్వామీ దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు.

4 / 5
కరోనాకు ముందు శబరిమల కొండను అయ్యప్ప భక్తులు మండల, మకరవిళక్కు పూజల సమయంలో లక్షలాది మంది దర్శించుకునేవారు. అయితే కరోనా కట్టడి నివారణలో భాగంగా గత ఏడాది నుంచి స్వామి వారిని దర్శించుకునే భక్తులకు పరిమిత సంఖ్యంలోనే అనుమతిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈసారి 5వేల మంది భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు.

5 / 5
Follow us