మన టాలీవుడ్ స్టార్ హీరో చిన్నప్పుడు ఎలా ఉన్నారో చుశారా ? అయితే ఈ ఫోటోలో ఉన్న పిల్లాడిని గుర్తుపట్టండి చూద్దాం..
కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడిపోగా.. సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో హీరోహీరోయిన్లు.. దర్శకనిర్మాతలు తమ కుటుంబాలతో సమయాన్ని
కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడిపోగా.. సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో హీరోహీరోయిన్లు.. దర్శకనిర్మాతలు తమ కుటుంబాలతో సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తమ వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమా విషయాలను.. షేర్ చేస్తూ.. అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. అప్పుడప్పుడూ లైవ్‌లు, మరికొన్నిసార్లు త్రోబ్యాక్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా కేవలం హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్‍చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సాయిపల్లవి, కీర్తి సురేష్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్స్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఓ స్టార్ హీరో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఈ పిల్లాడు.. అమాయకపు ముఖంతో.. చిన్న చిరునవ్వుతో ఫోటోకు ఫోజిచ్చాడు. ఎవరో గుర్తుపట్టండి.. చూద్దాం.
గుర్తుపట్టారా ? ఎంటీ ఇప్పటికీ గుర్తుపట్టలేదా ? పోనీ ఈ ఫోటోలో చెట్ల మాటున్న ఉండి.. చిరునవ్వు చిందిస్తున్నా ఈ చిన్నారిని చూశారా ? ఈ పిల్లాడు కూడా మన టాలీవుడ్ స్టార్ హీరోనే. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు.
ఇంకా గుర్తుపట్టలేదా ? అయితే ఈ ఫోటోలో మాత్రం తప్పుకుండా గుర్తుపట్టే ఉంటారు. తిరుమల శ్రీవారి ఫోటోను పట్టుకుని అందరికంటే ముందుగా నడుస్తున్న ఈ పిల్లాడిని.. మీరు గుర్తుపట్టే ఉంటారు. ఈ చిన్నారిని ఇప్పుడు అందరూ స్టైలీష్ స్టార్ అని, బన్నీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అదేనండి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. చిన్ననాటి ఫోటోలు ఇవన్ని. గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ కు జోడీగా రష్మకి మందన్న నటిస్తుండగా.. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అంతేకాకుండా.. అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై కనిపించబోతుంది.
ట్వీట్..
View this post on Instagram