Telangana Tourism: ఊటీ పోదాం ఛలో ఛలో.. తెలంగాణ టూరిజం నుంచి సూపర్ టూర్ ప్యాకేజీ
సమ్మర్ హాలీడేస్ ముగింపు దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో చాలా మంది వివిధ ప్రదేశాలకు ట్రిప్స్ వేయాలనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం రకరకాల టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ టూరిజం అందిస్తోన్న బెస్ట్ ప్యాకేజీల్లో ఊటీ ఒకటి...
సమ్మర్ హాలీడేస్ ముగింపు దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో చాలా మంది వివిధ ప్రదేశాలకు ట్రిప్స్ వేయాలనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం రకరకాల టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ టూరిజం అందిస్తోన్న బెస్ట్ ప్యాకేజీల్లో ఊటీ ఒకటి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ఊటిని సమ్మర్‌లో సందర్శిస్తే ఆ కిక్కే వేరు. హైదరాబాద్ ఊటీ మైసూర్ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజ్ ధర వివరాలు.? ఇప్పుడు తెలుసుకుందాం..
* తొలి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఐఆర్‌ఓ యాత్రినివాస్ నుంచి జర్నీ ప్రారంభమవుతుంది. ఇక నాలుగు గంటలకు బషీర్‌భాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. అక్కడ ప్రయాణికులు ఎక్కిన తర్వాత రాత్రంతా బెంగళూరు జర్నీ ఉంటుంది.
* రెండో రోజు ఉదయం 6 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఫ్రెషప్ అవుతారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు బెంగళూరులోని బుల్ టెంపుల్, లాల్ బంగ్లా, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్, టిపుస్ ప్యాలెస్, కబ్బన్ పార్క్ వంటివి వీక్షిస్తారు. అనంతరం హోటల్‌కు తిరిగి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. రాత్రి హోటల్‌లోనే బస చేయాల్సి ఉంటుంది.
* మూడో రోజు ఉదయం 4 గంటలకు ఊటీ బయలు దేరి వెళ్లాల్సి ఉంటుంది. ఊటీకి సొంతంగా ప్రయాణ ఖర్చులు పెట్టుకోవాలి. మధ్యాహ్నం 1 గంటకు ఊటికి చేరుకుంటారు. అనంతరం 2.30 గంటల తర్వాత లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. ఇందులోని బొటానికల్ గార్డెన్, బోటింగ్ కవర్ అవుతాయి. సాయంత్రం 6 గంటలకు ఊటీలో హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి హోటల్‌లోనే బస ఉంటుంది.
* ఇక నాలుగో రోజు ఉదయం 9 గంటలకు ఊటి నుంచి బయలు దేరి సాయంత్రం 6 గంటల వరకు మైసూర్ చేరుకుంటారు. అక్కడ బ్రిందావనం గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రి 9 గంటలకు హోటల్‌స్థలో చెకిన్ అవుతారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
* 5వ రోజు ఉదయం 7 గంటలకు మైసూర్‌లోని కొన్ని ప్రదేశాలను సందర్శిస్తారు. వీటిలో చాముండేశ్వరి టెంపుల్, మైసూర్ మహారాజా ప్యాలెస్,బిగ్ బుల్ టెంపుల్ కవర్ అవుతాయి. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మైసూర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
* 6వ రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధర వివరాలు..
ప్యాకేజీ ధర విషయానికొస్తే.. పెద్దలకు రూ.11,999గా ఉంది. పిల్లలకు రూ. 9,599గా నిర్ణయించారు. సింగిల్ ఆక్యూపెన్సీ అయితే 3వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రయాణం వోల్వో కోచ్ బస్సులో ఉంటుంది. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..