రష్మికపై ఆ స్టార్ హీరో కక్ష కట్టాడా? అందుకే ఇలా చేస్తున్నాడా?

01  January 2025

Basha Shek

ప్రస్తుతం బాగా పాపులారిటీ, క్రేజ్ ఉన్న హీరోయిన్లలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా అందరికన్నా ముందుంటుంది.

పుష్ప, పుష్ప2, యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా రష్మిక క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అంతే.

 ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కుబేర, సికందర్, రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్  తదితర పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి.

అయితే నేషనల్ క్రష్ గా మన్ననలు అందుకుంటోన్న రష్మిక మందన్నా అంటే ఒక స్టార్ హీరోకు పడడం లేదని తెలుస్తోంది.

 కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన రిషబ్ శెట్టి రష్మిక మందన్నాపై కక్ష కట్టాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన కిరిక్ పార్టీ సినిమాను ఉద్దేశించి తాజాగా రిషబ్ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఇందులోరష్మిక పేరును ప్రస్తావించలేదు.

ఈ సినిమాతోనే రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రిషబ్ శెట్టి సోదరుడు రక్షిత్ శెట్టి ఇందులో హీరోగా నటించాడు.

రిషబ్ పోస్ట్‌లో తన సోదరుడు రక్షిత్‌ పేరును మాత్రమే ప్రస్తావించి రష్మిక పేరు చెప్పకపోవడంపై అభిమానులు భగ్గుమంటున్నారు.