IRCTC: భూతల స్వర్గం కేరళ టూర్ ప్యాకేజీ.. హౌజ్ బోట్‌లో మరిచిపోలేని అనుభూతి.
ఎక్సోటిక్ కేరళ విత్ హౌజ్ బోట్ స్టే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. 5 రోజులు 4 రాత్రులుగా ఈ టూర్ ఉంటుంది. త్రివేంద్రం నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారు ముందుగా త్రివేంద్రం చేరుకొని అక్కడి నుంచి ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ టూర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.?
సమ్మర్ హాలీడేస్ ముగింపు దశకు చేరుకుంటున్నాయి. స్కూల్స్ తిరిగి ప్రారంభంకానున్నాయి. దీంతో చాలా మంది టూర్ ప్లాన్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ సమ్మర్‌లో మీ చిన్నారులకు మరిచిపోలేని అనుభూతిని పంచాలనుకుంటున్నారు. మీకోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందిస్తోంది. భూతల స్వర్గంగా పిలుచుకునే కేరళలోని ప్రకృతి అందాలను వీక్షించే అద్భుత అవకాశాన్ని కల్పించింది.
ఎక్సోటిక్ కేరళ విత్ హౌజ్ బోట్ స్టే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. 5 రోజులు 4 రాత్రులుగా ఈ టూర్ ఉంటుంది. త్రివేంద్రం నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారు ముందుగా త్రివేంద్రం చేరుకొని అక్కడి నుంచి ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ టూర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధరలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాఉల ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయాణం ఇలా సాగుతుంది..
* తొలిరోజు త్రివేంద్రం ఎయిర్ పోర్ట్ లేదా రైల్వేస్టేషన్ లేదా కొచువెలి రైల్వేస్టేషన్‌లో పికప్ చేసుకుంటారు. అనంతరం కోవలమ్ లేదా త్రివేంద్రంలో హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. భోజనం అనంతరం సాయంత్రం అజ్హిమల శవ స్టాచ్యూ, కోవలమ్ బీచ్ సందర్శన ఉంటుంది. రాత్రి బస త్రివేంద్రంలోనే ఉంటుంది.
* రెండో ఉయం ఉదయం పద్మనాభస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కుమరకోమ్‌కు చేరుకుంటారు. అక్కడ కేరళ బ్యాక్ వాటర్ క్రూజ్‌లో హౌజ్‌బోట్‌లో ప్రయాణం ఉంటుంది. బోట్ హౌజ్‌లోనే టిఫిన్, లంచ్, డిన్నర్ ఉంటుంది. రాత్రంతా బస బోట్‌లో ఉంటుంది.
* ఇక మూడో రోజు ఉదయం తెక్కడి బయలుదేరి వెళ్తారు. మార్గ మధ్యంలో కొన్ని తోటలను సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెకిన్ అవుతారు. బోటింగ్ వంటివి చేయొచ్చు. రాత్రి తెక్కడిలోనే బస ఉంటుంది.
* 4వ రోజు ఉదయం మున్నార్‌కు బయలుదేరి వెళ్తారు. అక్కడ టీ తోటలు, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్, కుండాలా డ్యామ్ లేక్ సందర్శన ఉంటుంది. రాత్రి మున్నార్‌లోనే బస ఉంటుంది.
* ఇక 5వ రోజు ఉదయం ఎరవికులమ్ నేషనల్ పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కొచ్చికి ప్రయాణం మొదలవుతుంది. కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లేదా, ఎర్నకులమ్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మీ సొంత ప్రాంతానికి వెళ్లొచ్చు.
ప్యాకేజీ ధర వివరాలు..
ధరల విషయానికొస్తే.. కంఫర్ట్ క్లాస్ సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 52,430, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 26,940, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ. 20,120, చైల్డ్ విత్ బెడ్ రూ. 6790, చైల్డ్ వితవుట్ బెడ్ రూ. 4040గా నిర్ణయించారు. ఏసీ వాహనాలతో పాటు హోటల్స్‌లో బస, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. టూర్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..