IRCTC Tour: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నార్త్ ఇండియాలోని ఫేమస్ టెంపుల్స్‌ను సందర్శించవచ్చు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ ప్యాకేజీ విశాఖపట్నం సమీపంలోని యాత్రికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ టూర్ ప్యాకేజీ ఉత్తర భారతదేశంలోని వివిధ దేవాలయాలు, పర్యాటక స్థలాలను సందర్శించే అవకాశాన్ని పర్యాటకులకు అందిస్తుంది.

IRCTC Tour: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నార్త్ ఇండియాలోని ఫేమస్ టెంపుల్స్‌ను సందర్శించవచ్చు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Irctc Tour Package
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2023 | 10:37 AM

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఉత్తర భారత దేశ యాత్రకు వెళ్లాలనుకునే ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది.  విశాఖపట్నం నుండి ఉత్తర భారతదేశంలోని తీర్థయాత్రలకు ప్రత్యేక రైలు ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ విశాఖపట్నం సమీపంలోని యాత్రికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ టూర్ ప్యాకేజీ ఉత్తర భారతదేశంలోని వివిధ దేవాలయాలు, పర్యాటక స్థలాలను సందర్శించే అవకాశాన్ని పర్యాటకులకు అందిస్తుంది.

పర్యటనలో ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుభవాన్ని అందించడానికి అనుభవజ్ఞులైన గైడ్‌లతో పర్యటన సాగనుంది. ఈ ప్యాకేజీ వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ పర్యటన 8 రాత్రులు, 9 పగళ్లు సాగనుంది. 10 జూన్ 2023న ప్రారంభం కానున్న ఈ యాత్ర జూన్ 18న ముగుస్తుంది.

తాజ్ మహల్, కృష్ణ జన్మభూమి (మధుర), బృందావన్‌లోని ప్రేమ మందిర్, బాంకే బిహారీ మందిర్, కత్రాలోని  వైష్ణో దేవి, హరిద్వార్‌లోని మానసా దేవి, హర్ కి పౌరి, లక్ష్మణ్ ఝూలా, రిషికేశ్‌లోని రామ్ ఝూలా సహా మరిన్ని ప్రసిద్ధ ప్రదేశాలు , సందర్శన స్థలాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ టూర్ ప్యాకేజీలోని ప్రయాణీకుల కోసం IRCTC అన్ని సౌకర్యాలను కల్పించనుంది. టికెటింగ్, వసతి కోసం, IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు కోసం నిర్ణీత ఖర్చులను చేసింది.

ప్యాకేజీ టికెట్ ధర: 

ఎకానమీ ప్యాకేజీ ధర రూ.15,435,

స్టాండర్డ్ ప్యాకేజీ రూ.24,735,

కంఫర్ట్ ప్యాకేజీ రూ.32,480. ఈ ధరలలో స్థానిక రవాణా ఛార్జీలు కూడా కలిపి ఉన్నాయి.

ఎకానమీ ప్యాకేజీని ఎంచుకునే ప్రయాణికులకు నాన్-ఏసీ గదుల్లో వసతి కల్పిస్తారు. స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీలను ఎంచుకునే వారికి షేరింగ్ ప్రాతిపదికన ఏసీ గదులను ఏర్పాటు చేస్తారు. ఉత్తర భారతదేశంలోని తీర్థయాత్రలకు సంబంధించిన ప్రత్యేక రైలు ప్యాకేజీ వివరాలకు, మరింత సమాచారం కోసం, ఆసక్తిగల వ్యక్తులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని IRCTC కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా చందన్‌కుమార్ (8287932318), విశాలాక్షి (9701085461)లను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!