IRCTC Tour Package: కేవలం రూ.16వేలకే.. ఉజ్జయిని మొదలు ఉత్తరాఖండ్ వరకు.. ఎన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చో !!
రైలు మార్గం లేని చోట, రైలు దిగిన తరువాత స్థానిక ప్రదేశాల్లో పర్యటించేందుకు టాక్సీలను కూడా వారే ఏర్పాటు చేస్తారు. ఇండియన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి ఈ టూర్ ప్యాకేజ్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. IRCTC తన సమాచారాన్ని ట్విట్టర్‌లో పంచుకుంది. సమాచారం ప్రకారం, పర్యటన జూన్ 22, 2023 నుండి ప్రారంభమవుతుంది.
IRCTC North India Tour Package: ఎండాకాలం అయిపోవచ్చింది. అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తై రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. దీంతో చాలా మంది ప్రజలు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తుంటారు. మరికొందరు ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రాలను సందర్శించేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే మీకోసం తక్కువ ధరలోనే రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ఐఆర్‌సీటీసీ టూరిస్టులు, భక్తులకు ఒక గొప్ప గుడ్ న్యూస్ ప్రకటించింది. కేవలం 16,600 రూపాయలకే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి మొదలుపెడితే.. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వరకు.. ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఆధ్మాత్మిక విహార యాత్రకు అవకాశం కల్పించింది. భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు టూర్ ప్యాకేజీ పేరు ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్ జూన్ 22 నుండి ప్రారంభం అవుతుంది. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ఆగ్రా, మధురలోని బృందావన్, హరిద్వార్, రిషికేశ్, పంజాబ్‌లోని అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్, జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి టెంపుల్ సందర్శించే అవకాశం ఉంటుంది.
ఇది ఎలాంటి టూర్ ప్యాకేజీ అంటే.., జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని మా వైష్ణో దేవి ఆలయంతో పాటు, గంగమ్మ తల్లి నుంచి మొదలుకుని హరిద్వార్ వరకు పేరొందిన పుణ్యక్షేత్రాలు తిరిగి దైవదర్శనం చేసుకోవచ్చు. ఇంతటితో ఈ టూర్ ప్యాకేజీ పూర్తి కాలేదు.. ఇటు రిషికేశ్ హిల్ స్టేషన్ ప్రకృతి అందాలను కూడా దగ్గరగా వీక్షించే అవకాశం పొందవచ్చు. ఐఆర్సీటీసీ డిజైన్ చేసిన ఈ టూర్ ప్యాకేజీ రూ. 16,600 నుండి ప్రారంభం అవుతుంది. IRCTC తన సమాచారాన్ని ట్విట్టర్‌లో పంచుకుంది. సమాచారం ప్రకారం, పర్యటన జూన్ 22, 2023 నుండి ప్రారంభమవుతుంది.
మహారాష్ట్రలోని పూణే నుంచి ప్రారంభమయ్యే ఈ సరికొత్త ప్యాకేజీ టూర్‌లో ప్రయాణీకుల బస, ఆహారం కోసం రైల్వే శాఖనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజ్ ఎంచుకునే వారు మహారాష్ట్రలోని పూణె, లోనావాలా, కర్జాత్, కళ్యాణ్, గుజరాత్ లోని వసాయ్ రోడ్, సూరత్, వడోదర స్టేషన్ల నుండి ఎక్కడైనా ఎక్కవచ్చు లేదా దిగిపోవచ్చు. ఈ యాత్రంలో భాగంగా 9 రాత్రులు, 10 పగళ్లు కలిపి మొత్తం 10 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. రైలు మార్గం లేని చోట, రైలు దిగిన తరువాత స్థానిక ప్రదేశాల్లో పర్యటించేందుకు టాక్సీలను కూడా వారే ఏర్పాటు చేస్తారు. ఇండియన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి ఈ టూర్ ప్యాకేజ్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఇకపోతే, టూర్ ప్యాకేజీ ధరలు మారుతూ ఉంటాయి. మీరు స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ. 16,000 నుంచి ప్రారంభమవుతుంది. మీరు థర్డ్ ఏసీలో ప్రయాణించాలనుకుంటే, దీని కోసం మీరు ఒక్కొక్కరికి రూ.29200 ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఏసీకి ఒక్కో వ్యక్తికి రూ.35,100 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..