రెస్టారెంట్ ఫుడ్ తిన్న స్టూడెంట్స్‌కి షాకిచ్చిన సిబ్బంది.. రూ.లక్ష బిల్లు చూసిన విద్యార్థులకు కళ్లు బైర్లు

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, రెస్టారెంట్ విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. దాంతో సదరు రెస్టారెంట్ విద్యార్థులకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది. పరిహారం కింద నలుగురు విద్యార్థులకు రూ. 12.5 లక్షలు పరిహారం ఇప్పించారు. దీనికి సంబంధించిన వార్త  ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

రెస్టారెంట్ ఫుడ్ తిన్న స్టూడెంట్స్‌కి షాకిచ్చిన సిబ్బంది.. రూ.లక్ష బిల్లు చూసిన విద్యార్థులకు కళ్లు బైర్లు
Restaurant
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2023 | 2:04 PM

హెటళ్లు, రెస్టారెంట్‌లకు వెళ్లటం నేటి యువతలో సర్వసాధారణం. అయితే, ఇక వేరే ప్రాంతాలకు టూరిస్ట్ లుగా వెళ్లినప్పుడు మనందరం తప్పనిసరిగా రెస్టారెంట్లకు వెళ్లాల్సిందే. అలా వెళ్లినప్పుడు అచితూచీ ఖర్చులు పెట్టడం కూడా సాధారణ విషయమే. అయితే, ఒక నలుగురు విద్యార్థులకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. భోజనం చేయడానికి రెస్టారెంట్ కి వెళ్లి విద్యార్థులు..వారికి కావాల్సిన మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు. తీరా చివరలో ఇచ్చిన బిల్లు చూసి వారికి దిమ్మ తిరిగిపోయింది. రెస్టారెంట్‌ ఇచ్చిన బిల్లు ఏకంగా దాదాపు లక్ష రూపాయలు కావటంతో వారికి షాక్‌ తగిలినంతపనైంది. అయితే, ఆ రెస్టారెంట్ తమను మోసం చేస్తోందని అర్థం చేసుకున్న ఆ విద్యార్థులు అందుకు తగిన బుద్ది చెప్పారు. ఈ సంఘటన ఇటలీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

జపాన్ కి చెందిన నలుగురు విద్యార్థులు టూర్ కి ఇటలీ వెళ్లారు. అక్కడి అందాలను చూసి మురిపోయారు. ఓ రోజు భోజనం కోసం వారు అక్కడ ఓ ప్రముఖ రెస్టారెంట్ కి వెళ్లారు. భోజనంలో వారు నాలుగు ప్లేట్ల స్లీక్, ఒక వాటర్ బాటిల్, ఫ్రైడ్ ఫిష్ ఆర్డర్ చేశారు. ఫుడ్ ఎంజాయి చేసిన తర్వాత బిల్లు చూసి వారు షాకయ్యారు. దాదాపు రూ.లక్ష బిల్లు వేశారు. దీంతో విద్యార్థులు రెస్టారెంట్ ఉద్యోగులను నిలదీశారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది చెప్పి విషయం విని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. రెస్టారెంట్ ఇంటర్నెట్ హాట్‌స్పాట్‌ను ఉపయోగించినందుకు ఆ రెంజ్‌లో బిల్లేశామని వారు చల్లగా చావు కబురు చెప్పారు. అంతేకాదు బిల్లు కట్టేంతవరకు వారిని రెస్టారెంట్ నుంచి బయటకు పంపించలేదు. దీంతో.. బిల్లు చెల్లించక తప్పలేదు. డబ్బులు కట్టేసి అక్కడి నుంచి బయటకు వచ్చారు.

కానీ, ఇలాంటి హిడెన్ ఛార్జీలు విధించడం పట్ల ఆ విద్యార్థులు న్యాయ పోరాటం చేశారు. తమకు చెప్పకుండా మోసం చేశారని, అదనంగా డబ్బులు వసూలు చేశారని రెస్టారెంట్‌పై వారు కేసు పెట్టారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, రెస్టారెంట్ విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. దాంతో సదరు రెస్టారెంట్ విద్యార్థులకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది. పరిహారం కింద నలుగురు విద్యార్థులకు రూ. 12.5 లక్షలు పరిహారం ఇప్పించారు. దీనికి సంబంధించిన వార్త  ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ..