ఎక్కువ రోజులు కలయికకు దూరంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి తగ్గుతుందని చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ క్రమంగా తగ్గుతుండటంతో వ్యాధులను ఎదుర్కునే సామర్ధ్యం తగ్గుతుంది.
సహజంగా మహిళలు నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పితో ఇబ్బందిపడుతుంటారు. ఈ నొప్పి రోజుల పాటు కలయికకు దూరంగా ఉన్నవారిలో, లైంగిక కోరికలు తగ్గిన వారిలో మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ కాలం కలయికకు దూరంగా ఉంటే.. వెజైనా ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. కాల క్రమేనా వెజైనల్ ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎక్కువకాలం శృంగారానికి దూరంగా ఉంటే ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉందట. కలియిక సమయంలో విడుదలయ్యే సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడమే కాదు.. ఆత్మవిశ్వాసం కూడా పెంచుతుంది.
అలాగే ఎక్కువ కాలం కలయికకు దూరంగా ఉంటే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ పెరిగే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.
లైంగిక కోరికలు పెరగడానికి డార్క్ చాక్లెట్, అరటి పండు లాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎక్కువ రోజులు కలయికకు దూరంగా ఉన్నవారిలో నిద్రలేమి సమస్య వస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. కలయిక సమయంలో డోపామైన్ విడుదలవుతుంది. అది ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.
పైన పేర్కొన్న అంశాలు అన్ని కూడా పలు అధ్యయనాలు, జర్నల్స్ నుంచి సేకరించిన ప్రాధమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే కచ్చితంగా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.