27 December 2024
Pic credit -Social Media
TV9 Telugu
తీపి, పులుపు రుచి కలిగిన ఉసిరి మురబ్బా అంటే అందరికీ ఇష్టమే.. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తింటారు. ఆరోగ్య పరంగా కూడా ఇది చాలా మంచిది
విటమిన్ ఎ, సి, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం , ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉసిరికాయలో లభిస్తాయి. శీతాకాలంలో మంచి ఫుడ్ అని చెప్పవచ్చు.
ఉసిరి మురబ్బా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని డైటీషియన్ ప్రియా పలివాల్ అంటున్నారు. అయితే ఇది కొంతమందికి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు
ఎవరైనా జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వారు ఉసిరి మురబ్బాను తినకూడదు. ఇది అల్సర్ లేదా ఎసిడిటీ సమస్యను పెంచుతుంది.
ఉసిరి మురబ్బాను ఎక్కువగా ఉసిరి కాయలు, పంచదారను ఉపయోగించి తయారు చేస్తారు. కనుక ఉసిరి మురబ్బా తినడం మధుమేహ రోగులకు మంచిది కాదు.
ఎవరైనా ఎటువంటి మందులను తీసుకుంటున్నా సరే ఉసిరి మురబ్బాను తినవద్దు. దీనిని తినే ముందు తప్పని సరిగా వైద్యుడిని సంప్రదించండి
తియ్యగా పుల్లగా నోటికి రుచిగా ఉంటుదని కదా అంటూ తెగ తినొద్దు. రోజులో ఒకటి లేదా రెండు మురబ్బాలను మాత్రమే తినాలని నిపుణులు అంటున్నారు. ఇంతకంటే ఎక్కువ తింటే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు