28 December 2024
Pic credit -Social Media
TV9 Telugu
శీతాకాలంలో చాలా మంది వేయించిన శనగలు, బెల్లం కలిపి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇష్టంగా తింటారు, ఈ కాంబినేషన్ లో బెల్లం, శనగలు తినడం వలన శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది.
మనం సాంప్రదాయ భారతీయ స్నాక్స్ గురించి మాట్లాడినట్లయితే... బెల్లం .. వేయించిన శనగలు కంటే మెరుగైనది ఏమీ ఉండదు. అయితే ఈ కాంబినేషన్ కొంతమందికి హాని కూడా కలిగిస్తుంది
కొన్ని ఆరోగ్య పరిస్థితులున్న వారు బెల్లం, శనగలు తినకూడదు అని ప్రముఖ డైటీషియన్ ప్రియా పాలివాల్ చెప్పారు. ఈ కాంబినేషన్ లో తింటే కొందరికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు.
ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ అయితే.. బెల్లం శనగలు తినకూడదు. బెల్లంలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవారు బెల్లం, శనగపప్పు తినే ముందు జాగ్రత్తగా ఉండాలి.
కొందరికి అలర్జీ సమస్యలు ఉంటాయ.. అటువంటి వారు బెల్లం, శనగపప్పు తినొద్దు అని డైటీషియన్ చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు బెల్లం ,శనగలు కలిపి తీసుకోవాలనుకుంటే ముందుగా డాక్టరును సంప్రదించాలి. ఎందుకంటే ఈ కాంబినేషన్ అధిక కేలరీల కంటెంట్‌ను కలిగి ఉంటుంది