Snake Temples: ఈ క్షేత్రంలో అనీ సర్పాలే.. కాల సర్ప దోష నివారణకు చేయాల్సిన పూజ, మంత్రం మీ కోసం

హిందువుల విశ్వాసం ప్రకారం మాత్రమే కాదు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కాల సర్ప దోషం ఉన్నట్లు అయితే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలా సర్ప దోషం ఉన్నవారు నియమ,  నిబంధనలతో సర్పానికి పూజ చేయాల్సి ఉంది. ఈ దోష నివారణకు సర్పంతో సంబంధం ఉన్న పవిత్ర తీర్థయాత్రకు వెళ్లి పూజిస్తారు.

Snake Temples: ఈ క్షేత్రంలో అనీ సర్పాలే.. కాల సర్ప దోష నివారణకు చేయాల్సిన పూజ, మంత్రం మీ కోసం
Snake Temple Of India
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2023 | 1:16 PM

సనాతన సంప్రదాయంలో అన్ని దేవతలతో పాటు పాములను కూడా పూజిస్తారు. హిందూ మతంలో పాము ఆరాధన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివుడు తన మెడలో నాగేంద్రుడిని హారంగా ధరిస్తే.. శ్రీ మహావిష్ణువు శేషుడిని శయ్యగా చేసుకుని నిద్రిస్తున్నాడని పురాణాల కథనం. శ్రీకృష్ణుడు కాళీయుడిపై నృత్యం చేసినట్లు పురాణాల కథనం. హిందూమతంలో పాము ఆరాధనకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు  జ్యోతిషశాస్త్రపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. పాములకు సంబంధించిన అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.  అక్కడ చేసే పూజల వల్ల కలిగే శుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రంలో సర్ప పూజ ప్రాముఖ్యత

హిందువుల విశ్వాసం ప్రకారం మాత్రమే కాదు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కాల సర్ప దోషం ఉన్నట్లు అయితే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలా సర్ప దోషం ఉన్నవారు నియమ,  నిబంధనలతో సర్పానికి పూజ చేయాల్సి ఉంది. ఈ దోష నివారణకు సర్పంతో సంబంధం ఉన్న పవిత్ర తీర్థయాత్రకు వెళ్లి పూజిస్తారు. ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర్‌, ప్రయాగలోని తక్షకేశ్వర్‌, నాగ వాసుకి ఆలయాల్లో కాల సర్ప దోషానికి సంబంధించిన పూజలు చేస్తే కాలసర్ప దోషం తొలగిపోతుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

అదేవిధంగా కేరళలో ఉన్న మన్నరసాల దేవాలయం సర్ప క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ వేలాది విగ్రహాలు, పాముల చిత్రాలు ఉన్నాయి. ప్రజలు దీనిని స్నేక్ టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ చూసినా, పూజించినా సంతానం కలుగుతుందని.. పిల్లలు సంతోషంగా జీవిస్తారని నమ్మకం.

కాల సర్ప దోష నివారణకు పరిహారాలు

హిందూ విశ్వాసం ప్రకారం ఏదైనా దేవత లేదా దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించడం వలన.. వారిని పూజించడం వలన పుణ్యం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో నాగదేవత ఆశీర్వాదం పొందడానికి..  జాతకంలో ఉన్న కాలసర్ప దోషం తొలగిపోవడానికి.. ఎవరైనా ఈ సర్ప క్షేత్రాలకు వెళ్లి పూజాదికార్యక్రమాలను నిర్వహించాలి. క్షేత్రంలో నాగ స్తోత్రాన్ని నవకులాయ విద్మహే విషదన్తాయ ధీమహి .. తన్నో సర్పః ప్రచోదయాత్ అనే సర్ప గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.

వెండితో చేసిన సర్పాన్ని సర్ప తీర్థానికి వెళ్లి పూజించి, ప్రవహించే పవిత్ర జలంలో నిమజ్జనం చేస్తే జాతకంలో కాలసర్ప దోషం తొలగి ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని విశ్వాసం. కాల సర్ప దోషానికి సంబంధించిన బాధల భయాలనుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).