Wednesday Puja Tips: బుధవారం గణేషుడిని ఇలా పూజించి చూడండి.. రెంట్టింపు ఫలితాలు మీ సొంతం..

హిందూ మత విశ్వాసాల ప్రకారం అన్ని దేవీ దేవతల సహా అందరూ మొదట గణేష్ ను పూజిస్తారు. ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు.

Wednesday Puja Tips: బుధవారం గణేషుడిని ఇలా పూజించి చూడండి.. రెంట్టింపు ఫలితాలు మీ సొంతం..
Lord Ganesha Puja
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2023 | 8:10 AM

హిందూ మతంలో బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది.  బుధవారం నాడు వినాయకుడిని పూజించడం వల్ల మనిషికి ఉన్న ఆటంకాలు, కష్టాలు, రోగాలు, దారిద్య్రం  తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు మత విశ్వాసాల ప్రకారం అన్ని దేవీ దేవతల సహా అందరూ మొదట గణేష్ ను పూజిస్తారు. ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా చేయడం వలన అతనికి సంతోషం కలుగుతుంది. భక్తుల బాధలను తొలగిస్తుంది. గణేశుడిని సంతోషపెట్టడానికి బుధవారం చేయాల్సిన మార్గాలను తెలుసుకుందాం.

  1. ఎరుపు కుంకుమతో తిలక ధారణ : గణేశుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కనుక బుధవారం నాడు, గణేశుని ఆరాధన సమయంలో ఎర్రటి కుంకుమాన్ని తిలకాన్ని దిద్దండి. భక్తితో పూజించండి. ఇలా చేసిన    భక్తునిపై వినాయకుని అనుగ్రహాన్ని కురిపిస్తాడు.
  2. దర్భ గడ్డితో పూజ : శ్రీ విఘ్నేశ్వరుడిని ఆరాధించే సమయంలో తప్పనిసరిగా గడ్డిని సమర్పించండి.  దర్భలు అంటే గణేశుడికి అత్యంత ప్రీతిపాత్రం. కనుక గడ్డితో పూజిస్తే వినాయకుడు సంతోషిస్తాడు. భక్తులు గణేశుడికి బుధవారం దర్భలను సమర్పిస్తే అత్యంత ఫలవంతం.
  3. జమ్మితో పూజ : శమీ మొక్క అంటే జమ్మి వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. కావున బుధవారం రోజున  వినాయకునికి తప్పనిసరిగా శమీ మొక్కల్ని సమర్పించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ, సంపద,    శాంతి కలుగుతాయి.
  4. గణేశుడికి అన్నం నైవేద్యం : హిందూ మతంలో పూజ సమయంలో బియ్యాన్ని అక్షతలుగా సమర్పిస్తారు. ఎందుకంటే పూజలో అక్షతలు చాలా పవిత్రంగా భావిస్తారు. అదే సమయంలో గణేషుడికి అన్నం కూడా చాలా ఇష్టం. అయితే పొడి బియ్యాన్ని గణేశుడికి సమర్పించరాదు. గణేశుడిని పూజించే సమయంలో బియ్యాన్ని అన్నంగా లేదా పాయసం చేసి నైవేద్యంగా సమర్పించాలి. దీంతో సంతోషించిన గణేశుడికి తన భక్తులకు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తాడు.
  5. బెల్లం నైవేద్యం :  అది పూజ్యుడికి గణేశుడికి పండ్లను అటుకులను పూజ అనంతరం నైవేద్యంగా సమర్పించండి. అయితే బుధవారం వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం అత్యంత ఫలవంతం. గణేశుని అనుగ్రహం వల్ల ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరుతాయి. జీవితంలో ఆనందం నెలకొంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..