AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Holy Tree: హిందూమతంలో ఈ వృక్షాలకు పవిత్ర స్థానం.. పూజించడం వలన కోరుకున్న కోర్కెలు తీరతాయి..

హిందువుల విశ్వాసం ప్రకారం కొన్ని రకాల చెట్ల ఆకులను, పండ్లు, విత్తనాల ఇలా ప్రతి ఒక్కటికీ విశిష్టత కలిగి ఉంటుంది. వ్యక్తి కష్టాలను తొలగించి, ఆనందాన్ని, అదృష్టాన్ని పెంచే శక్తి ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం ఏ చెట్టు లేదా మొక్కను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరంగా తెలుసుకుందాం.

Hindu Holy Tree: హిందూమతంలో ఈ వృక్షాలకు పవిత్ర స్థానం.. పూజించడం వలన కోరుకున్న కోర్కెలు తీరతాయి..
Holy Trees Puja
Surya Kala
|

Updated on: Jun 07, 2023 | 9:12 AM

Share

హిందూమతం ప్రతి జీవిలో దైవాన్ని చూడమని పవిత్రంగా భావించామని చెబుతుంది. చెట్లు, మొక్కలు దేవుని వలె పవిత్రమైనవి, పూజనీయమైనవిగా పరిగణించబడుతున్నాయి. హిందూ విశ్వాసం ప్రకారం దేవతలు కొన్ని చెట్లమీద నివసిస్తారని విశ్వాసం. ఆ చెట్లను పూజించడం వలన జీవితంలో ఏర్పడే అన్ని రకాల బాధలను తొలగిస్థాయి. కోరికలను నెరవేరుస్థాయి. హిందువుల విశ్వాసం ప్రకారం కొన్ని రకాల చెట్ల ఆకులను, పండ్లు, విత్తనాల ఇలా ప్రతి ఒక్కటికీ విశిష్టత కలిగి ఉంటుంది. వ్యక్తి కష్టాలను తొలగించి, ఆనందాన్ని, అదృష్టాన్ని పెంచే శక్తి ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం ఏ చెట్టు లేదా మొక్కను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరంగా తెలుసుకుందాం.

  1. ఉసిరి చెట్టు పూజ: ఉసిరి చెట్టు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఉసిరి చెట్టు లక్ష్మీ దేవి కన్నీళ్ల నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఇందులో బ్రహ్మ, విష్ణు, మహాదేవులు నివసిస్తారు అని నమ్ముతారు. ఉసిరిని పూజించడం ద్వారా శ్రీ హరి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఉసిరి చెట్టును పూజించిన వ్యక్తిపై శ్రీ విష్ణువు, లక్ష్మీదేవిల అనుగ్రహం కురుస్తుందని..సకల సుఖాలు లభిస్తాయని..  చివరకు జీవితంలో మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు.
  2. అరటి చెట్టు పూజ: హిందూ విశ్వాసం ప్రకారం ఒక అరటి చెట్టు పవిత్రమైంది. అరటి చెట్టుని పూజించిన వ్యక్తి శ్రీ విష్ణువు, సత్య నారాయణ స్వామీ, దేవగురు బృహస్పతి ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఎవరి జీవితంలోనైనా ఆనందం లోపించినా, వివాహంలో జాప్యం జరిగినా రోజూ అరటి చెట్టును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
  3. మామిడి చెట్టు పూజ: మామిడి చెట్టును హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ చెట్టు ఆకులు,  పండ్లు అన్నీ పూజకు ఉపయోగపడతాయి. మామిడి ఆకుల తోరణం ఇంటి ప్రధాన ద్వారానికి ఏర్పాటు చేస్తే.. ఇంట్లో దుఃఖాలు, అనర్థాలు ప్రవేశించవని నమ్మకం. హిందూ విశ్వాసం ప్రకారం హనుమంతుడికి మామిడి పండు అంటే చాలా ఇష్టం. మంగళవారం ఐదు మామిడి పండ్లను సమర్పించడం అత్యంత ఫల వంతం.
  4. తులసి చెట్టు పూజ హిందూ మతంతో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. హిందువుల ప్రతి ఇంట్లోనూ తులసి కొలువుదీరుతుంది. తులసిని పూజించడం వలన ఇంటికి సంబంధించిన అన్ని లోపాలు తొలగిపోతాయి.  జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. హిందూ విశ్వాసం ప్రకారం తులసిని విష్ణుప్రియ అని పిలుస్తారు, శ్రీ హరిని అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధించే భక్తురాలు.
  5. శమీ వృక్ష పూజ సనాతన సంప్రదాయంలో శమీ వృక్షానికి మతపరంగానే కాదు జ్యోతిషశాస్త్రపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. శమీ మొక్క ఉన్న ఇంటిపై శనీశ్వరుడు దృష్టి పడదని.. శనీశ్వరుడు ఎప్పుడూ ఆ ఇంటిని వంక చూడడు అని నమ్మకం. శివలింగానికి జమ్మి ఆకులతో పూజించడం వలన బిల్వ పత్రం కంటే చాలా రెట్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది.శని సంబంధిత దోషాల నుండి విముక్తి పొందుతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).