Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: జీవితంలో అన్నీ సమస్యలైనా.. నవ గ్రహాల అనుగ్రహం కోసం ఏడు రోజులు ఈ పరిహారాలు చేసి చూడండి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలోని ప్రతి రోజుకు ఒకొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వారం రోజుల్లో ఒకొక్క రోజు ఒకొక్క గ్రహానికి సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. ఈ సందర్భంలో వారానికి 7 రోజులు సాధారణ జ్యోతిష్య పరిహారాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Astro Tips: జీవితంలో అన్నీ సమస్యలైనా.. నవ గ్రహాల అనుగ్రహం కోసం ఏడు రోజులు ఈ పరిహారాలు చేసి చూడండి..
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2023 | 11:20 AM

మనిషి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి వ్యక్తి తనకు ఏర్పడిన సమస్యలనుంచి బయటపడడానికి అనేక మార్గాలను అనుసరిస్తాడు. ఇటువంటి మార్గాలు ఒక వ్యక్తిని సమస్యల నుండి బయటపడెయ్యడమే కాదు.. అతని జాతకంలో గ్రహాల స్థితిని మెరుగుపరిచి తద్వారా అతని భవిష్యత్తులో  సాఫీగా జీవించడానికి సహాయపడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలోని ప్రతి రోజుకు ఒకొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వారం రోజుల్లో ఒకొక్క రోజు ఒకొక్క గ్రహానికి సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. ఈ సందర్భంలో వారానికి 7 రోజులు సాధారణ జ్యోతిష్య పరిహారాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

  1. సోమవారం పరిహారం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం చంద్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఎవరి జాతకంలో చంద్రుని స్థానం చెడుగా ఉంటే అతను తరచుగా అనారోగ్యానికి గురవుతాడు. ముఖ్యంగా  కీళ్లనొప్పులు, కంటి సమస్యలు, జలుబుతో ఇబ్బందిని పడతారు. చంద్ర దోషాన్ని తొలగించడానికి సోమవారం నాడు శివలింగానికి నీటితో లేదా పాలతో అభిషేకం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.  అంతేకాదు సోమవారం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల మీ సమస్యలను దూరం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
  2. కుజ దోష పరిహారం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారానికి అంగారకుడికి సంబంధం కలిగి ఉంది.  అంగారక  గ్రహ ప్రభావం మనిషి జీవితంపై తీవ్రంగా పడుతుంది. అనేక వ్యాధి కారకుడిగా అంగారకుడిని  పరిగణిస్తారు. ఈ గ్రహశాంతి కోసం మంగళవారం హనుమంతుడిని పూజించాలి. ఇవేకాకుండా  ఆకలి అన్నవారికి, పేద వారికీ ఆకలి తీర్చాలి. ఈ రోజు చేసే దానాలకు విశిష్ట ఫలితాలుంటాయి.
  3. బుధుడి కోసం పరిహారాలు : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం బుధుడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. బుధుడు బలపడాలంటే గణేశుడిని పూజించాలి. ఆ తర్వాత లడ్డూలను ప్రసాదంగా సమర్పించాలి. బుధవారం నాడు శ్రీమహావిష్ణువును పూజించినా పుణ్యఫలం లభిస్తుంది.
  4. బృహస్పతి పరిహారం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బృహస్పతి గురువైన ప్రగతిపతి దేవుడితో సంబంధం కలిగి ఉంటాడు. ఎవరి జాతకంలో బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉంటుందో.. అతను అన్ని దిశలలో పురోగతిని సాధిస్తాడు. జాతకంలో బలహీనమైన బృహస్పతి బలపడేందుకు పసుపు బట్టలు, పసుపు పండ్లు, పసుపు పువ్వులను, పవిత్ర గ్రంథాలను దానం చేయడం మంచిది.
  5. ఇవి కూడా చదవండి
  6. శుక్రవారం పరిహారం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రుడి అనుబంధం పరిగణించబడుతుంది. శుక్ర గ్రహం భౌతిక సుఖాలు, ఆనందం , శ్రేయస్సు కారకంగా పరిగణించబడుతుంది. శుక్ర గ్రహం స్థితిని బలోపేతం చేయడానికి శుక్రవారం రోజున పేద వివాహిత స్త్రీకి తేనెను దానం చేయడం ఉత్తమంగా పరిగణించబడుతుంది.
  7. శనివారం పరిహారం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనివారం శనీశ్వరుడితో సంబంధం కలిగి ఉంటుంది. శనీశ్వరుడు మనుష్యులకు వారి క్రియలను బట్టి ఫలాలను ఇస్తాడు. ఎవరి జాతకంలో శనీశ్వరుడు బలహీనంగా ఉంటె.. శని బలపడటం కోసం శివుడికి జలంతో అభిషేకం చేయాలి. అంతే కాకుండా రావి చెట్టుకు నీరు అందించాలి. శనీశ్వరుడు శనివారం చేసే దానాలతో సంతోషంగా ఉంటాడు. శనివారం రోజు మినప పప్పు  పేదవారికి దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  8. ఆదివారం పరిహారం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఆదివారంతో సంబంధం కలిగి ఉంటాడు. జాతకంలో సూర్యుడు బలపడాలంటే అక్షతలు, కుంకుమ, పంచదార, పువ్వులు కలిపిన నీళ్లతో నిత్యం సూర్యోదయ సమయంలో పూజించాలి. ప్రతిరోజూ వీలుకాకపోతే ఆదివారం  సూర్యుడికి అర్ఘ్యం అర్పించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).