- Telugu News Photo Gallery Spiritual photos chanakya niti these Qualies of parents are like enemies for children according to acharya chanakya in telugu
Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్నతల్లిదండ్రులే.. కన్న పిల్లలకు పెద్ద శత్రువులంటున్న చాణక్య
ఆచార్య చాణక్య సమాజానికి ఉపయోగపడే అనేక పుస్తకాలను తన రచనల ద్వారా అందించాడు. ఆచార్య చాణక్యుడు తన జీవితంలోని అనుభవాలన్నింటినీ తన నీతి శాస్త్రంలో పంచుకున్నారు. ఇందులో కొన్ని లక్షణాలున్న తల్లిదండ్రులకు వేరే శత్రువులు అవసరం లేదు.. సొంత పిల్లలకు శత్రువుల్లా ఉండే తల్లిదండ్రులను కూడా ప్రస్తావించాడు.
Updated on: Jun 07, 2023 | 12:49 PM

చదువుకు దూరమయ్యారు: పిల్లల చదువులపై శ్రద్ధ చూపని తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటివారని ఆచార్య చాణక్యుడు అన్నారు. అలాంటి పిల్లలు పండితులకు మాత్రమే కాదు సహచర విద్యార్థులకు జోక్ గా మారతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడం తల్లిదండ్రుల కర్తవ్యం.

తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.

మార్గనిర్దేశనం: పిల్లలకు చిన్నతనం నుంచే సన్మార్గంలో నడవాలని నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్యమని.. వారిలో సత్ప్రవర్తన బీజాలు నాటాలని చాణక్య నీతి చెబుతోంది. ఆచార్య చాణక్యుడు ఏ విత్తనం నాటితే అదే రకం చెట్టు పండ్లు వస్తాయి.. అదే విధంగా చిన్నతనంలో తమ పిల్లను ఎలా నడిపిస్తే పెద్ద అయ్యాక అలాగే నడుచుకుంటారు.

ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.





























