Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రదాడి ముప్పు.. పాక్ కేంద్రంగా విధ్వంసానికి కుట్ర.. అప్రమత్తమైన భద్రతా సంస్థలు

అమర్నాథ్ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చునని నిఘా వర్గాల నుండి సమాచారం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఇద్దరు కశ్మీరీ యువకులకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను అప్పగించిందట. 

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రదాడి ముప్పు.. పాక్ కేంద్రంగా విధ్వంసానికి కుట్ర.. అప్రమత్తమైన భద్రతా  సంస్థలు
Amarnath Yatra 2023
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2023 | 1:48 PM

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ యాత్ర తమజీవితంలో ఒక్కసారైనా చేయాలనీ ప్రతి హిందువు కోరుకుంటాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 1 నుండి  అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడే ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లుగా సమాచారం భారత భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అమర్నాథ్ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చునని నిఘా వర్గాల నుండి సమాచారం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం కశ్మీరీ యువకులకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను అప్పగించిందట.

అమర్‌నాథ్ యాత్రపై దాడి చేసే బాధ్యతను రఫీక్ నాయ్ ,మహ్మద్ అమీన్ బట్ అలియాస్ అబూ ఖుబైబ్‌లకు అప్పగించబడినట్లు తెలుస్తోంది. వీరు స్థానికులు కావడంతో వీరికి చొరబాటు మార్గాలన్నీ తెలుసు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. రాజౌరీ – ఫూంచ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడికి అవకాశముందని అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడులకు పాల్పడుతారని భావిస్తున్న ఇద్దరు యువకుల గురించి గాలిస్తున్నారు. వారి ఇళ్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

అమర్‌నాథ్ యాత్రకు ముందు జమ్మూ కశ్మీర్ లోని గ్రామంలోని ప్రతి భాగం భద్రతా దళాల పర్యవేక్షణలోకి వెళ్లాయి. స్క్వాడ్ టీమ్‌లు, క్యూఆర్‌టి, సిఆర్‌పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఎస్‌ఎస్‌బి, అలాగే అనేక ఇతర భద్రతా ఏజెన్సీలు యాత్రికుల భద్రతను తీసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

పవిత్రమైన అమర్‌నాథ్ ఆలయ సందర్శన కోసం నమోదు ప్రక్రియ జూలై 1, 2023న ప్రారంభమవుతుంది. ఈ ఆలయం జమ్మూ , కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. అమర్ నాథ్ యాత్ర 62 రోజుల పాటు కొనసాగుతుంది. యాత్ర ఆగస్టు 31, 2023న ముగుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..