నదికి ఒకవైపు భారత్ మరోవైపు నేపాల్.. కానీ ఆ ప్రదేశం ఎవ్వరినైనా ఆకర్షిస్తుంది.. ఎందుకంటే..
India, Nepal Border: భారతదేశం, నేపాల్ రెండు వేర్వేరు దేశాలు కానీ ఈ రెండు దేశాల సంస్కృతి చాలా దగ్గరగా ఉంటుంది. భారతదేశం ఎంత అందమైన దేశమో,
India, Nepal Border: భారతదేశం, నేపాల్ రెండు వేర్వేరు దేశాలు కానీ ఈ రెండు దేశాల సంస్కృతి చాలా దగ్గరగా ఉంటుంది. భారతదేశం ఎంత అందమైన దేశమో, నేపాల్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని ధార్చులాలో రెండు దేశాల సరిహద్దులు కలిసే ప్రదేశం ఒకటి ఉంది. ఈ ప్రదేశంలో ఒక నది ఉంటుంది. ఆ నదికి ఒక వైపు భారతదేశం మరోవైపు నేపాల్ ఉంటాయి. ఇక్కడి వ్యక్తులు ఇండియా నుంచి నేపాల్ వెళ్లడానికి ఈ నదిని దాటవలసి ఉంటుంది.
ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. అందుకే ఇక్కడి అందమైన మైదానాలలో తిరిగేందుకు పర్యాటకులు క్యూ కడుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పర్యాటకుడు తన ఇన్‌స్టా ఖాతా నుంచి ఇండో-నేపాల్ సరిహద్దు అందమైన చిత్రాన్ని షేర్ చేశాడు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఈ ప్రదేశం ప్రపంచంలోని అత్యంత అందమైన సరిహద్దులలో ఒకటి అని అందరు భావిస్తారు. ఈ ఫోటోలో కొండల ఒడిలో స్థిరపడిన డార్చులా, ధార్చుల మనోహరమైన ఛాయ కనిపిస్తుంది.
వాస్తవానికి డార్చులా నేపాల్‌లో భాగం. ధార్చులా భారతదేశంలో భాగం. ఈ రెండు ప్రదేశాల మధ్య నది ప్రవహిస్తుంది. ఇది రెండు దేశాలను కలుపుతుంది. ఫోటోలో నదికి కుడి వైపున భారతదేశం ఎడమవైపున నేపాల్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోను చాలామంది ప్రజలు ఇష్టపడుతున్నారు. వాస్తవానికి ధార్చుల పేరు వెనుక ఒక లాజిక్ కూడా ఉంది. ధర్ అంటే కొండ, చులా అంటే పొయ్యి అనే అర్థం వస్తుంది. దాని ఆకృతి స్టవ్ లాగా కనిపిస్తుంది. అందువల్ల దీనిని ధార్చుల అని పిలుస్తారు. ఇక్కడి ప్రజలను కలిసినప్పుడు ఈ వ్యక్తులు భారతీయులు అంటే అస్సలు నమ్మలేరు. అందరు నేపాల్ వారిలాగానే కనిపిస్తారు.
View this post on Instagram