AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palm oil: పామాయిల్‌ తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..

పామాయిల్‌ తీసుకోవడం వల్ల మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. బార్సిలోనాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బయోమెడిసిన్ ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో పాల్మిటిక్ యాసిడ్ నోటి, చర్మ క్యాన్సర్‌లో మెటాస్టాసిస్‌ను ప్రోత్సహిస్తుందని కనుగొన్నారు. పామాయిల్ అనేది తాటి చెట్ల పండ్ల నుంచి తీసిన నూనె. ఈ రోజుల్లో, ఇది ఎక్కువగా ప్యాక్ చేసిన...

Palm oil: పామాయిల్‌ తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..
Palm Oil
Narender Vaitla
|

Updated on: Sep 03, 2024 | 7:52 PM

Share

మనలో చాలా మంది పామాయిల్‌ను కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్‌లో పామాయిల్‌ను అధికంగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. పామాయిల్‌ను దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

పామాయిల్‌ తీసుకోవడం వల్ల మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. బార్సిలోనాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బయోమెడిసిన్ ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో పాల్మిటిక్ యాసిడ్ నోటి, చర్మ క్యాన్సర్‌లో మెటాస్టాసిస్‌ను ప్రోత్సహిస్తుందని కనుగొన్నారు. పామాయిల్ అనేది తాటి చెట్ల పండ్ల నుంచి తీసిన నూనె. ఈ రోజుల్లో, ఇది ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాలు, రెస్టారెంట్లలో ఉపయోగించబడుతుంది. నిజానికి ఇతర నూనెల కంటే పామాయిల్ చౌకగా లభిస్తుంది. కానీ ఇందులో చాలా పోషకాలు ఉండదు. ఇందులో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. పామాయిల్ తరచుగా ఆహార ప్యాకెట్లలో ఉపయోగిస్తారు.

ప్యాకీంగ్ చేసిన ఆహారంలో పామాయిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని ద్వారా, సంతృప్త కొవ్వు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ధమనులు బ్లాక్‌ అవ్వడానికి కారణమవుతుంది. పామాయిల్‌లో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. దీని వల్ల శరీరంలో ఎల్‌డిఎల్ స్థాయి పెరుగుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌. దీని కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా 4 రెట్లు పెరుగుతాయి. ఇక పామాయిల్ వాడకం శరీరంలో తీవ్రమైన జీవక్రియ సమస్యలను కలిగిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కారణమవుతుంది. పామాయిల్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీని కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. పామాయిల్‌లో ఉండే సంతృప్త కొవ్వు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇది పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ప్రోత్సహిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..