అధిక నిద్ర కూడా అనారోగ్యమే.. ఎప్పుడు సమయం దొరికినా నిద్రపోతున్నారా.. ఈ విటమిన్ లోపం ఏమో చెక్ చేసుకోండి..
కొందరు మాత్రం నిపుణులు చెప్పే విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సమయానికి తగినంత నిద్ర పోవడం లేదు. అదే సమయంలో కొంతమంది అధికంగా నిద్రపోతారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు సమయం దొరికినా సరే నిద్రపోవడానికి ఇష్టపడతారు. ఇలా చేయడానికి కారణం పని ఒత్తిడితో మాత్రమే కాదు నిద్ర లేమికి, అధిక నిద్రకు కారణం శరీరంలోని కొన్ని విటమిన్ల లోపం కావచ్చు.
ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు వలన చాలా మంది ప్రజలు ఒత్తిడి, నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. సరైన నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు మాత్రం నిపుణులు చెప్పే విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సమయానికి తగినంత నిద్ర పోవడం లేదు. అదే సమయంలో కొంతమంది అధికంగా నిద్రపోతారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు సమయం దొరికినా సరే నిద్రపోవడానికి ఇష్టపడతారు. ఇలా చేయడానికి కారణం పని ఒత్తిడితో మాత్రమే కాదు నిద్ర లేమికి, అధిక నిద్రకు కారణం శరీరంలోని కొన్ని విటమిన్ల లోపం కావచ్చు.
మన శరీరంలో అధిక నిద్రకు విటమిన్స్ లోపమే కారణమని కూడా పరిగణిస్తారని ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ పంకజ్ వర్మ చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ విటమిన్లు మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి లోపం వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే రెండు విటమిన్ల లోపం వల్ల అధిక నిద్ర వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ బి12
B12 శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటే జుట్టు రాలడం, చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు నాడీ వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల బాగా అలసిపోతారని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎక్కువ నిద్ర వస్తుంది. కనుక తినే ఆహారంలో పాలు, పెరుగు, చీజ్, గుడ్లు, చికెన్, బలవర్థకమైన తృణధాన్యాలు చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
విటమిన్ డి
ఎముకల పటిష్టతకు శరీరంలో విటమిన్ డి చాలా ముఖ్యం. కాల్షియం గ్రహించడానికి ఇది అవసరం. శరీరంలో విటమిన్ డి లోపం వల్ల అలసట, అధిక నిద్ర వంటి సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ లోపం ఉంటే వెంటనే ఈ విటమిన్ ను పెంచుకునేందుకు ప్రయత్నించండి.
శరీరంలో విటమిన్ డి కొరత తీరాలంటే సహజంగా దొరుకుతుంది. తెల్లవారు జామున పడే నీరు ఎండలో కొంత సేపు రొజూ కూర్చోవాలి. దీంతో సహజసిద్ధమైన రీతిలో విటమిన్ డి శరీరానికి అందుతుంది. అదే సమయంలో విటమిన్ డి శరీరానికి అందడం కోసం తినే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి.
ఆహారంలో గుడ్డు పచ్చసొన, సాల్మన్ చేపలు, పాలు , పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. శరీరంలో విటమిన్ బి 12 , డి తక్కువగా ఉన్నట్లు అయితే ఆరోగ్య నిపుణుల సలహాపై సప్లిమెంట్లను తీసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..