Mouth Ulcers: నోటి అల్సర్లు ఇబ్బంది పెడుతున్నాయా? తక్షణ ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి

కొంత మంది ఏడాది పొడవునా నోటి పుండ్లు సమస్యతో బాధపడుతుంటారు. అయితే కొంత మందికి మాత్రం ఈ సమస్య కేవలం రెండు రోజుల్లోనే నయమవుతుంది. అసలెందుకు ఇలా జరుగుతుందనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? నిజానికి, నోటి పుండ్లు వివిధ కారణాల వల్ల సంభవిస్తుంటాయి..

|

Updated on: Aug 07, 2024 | 12:40 PM

కొంత మంది ఏడాది పొడవునా నోటి పుండ్లు సమస్యతో బాధపడుతుంటారు. అయితే కొంత మందికి మాత్రం ఈ సమస్య కేవలం రెండు రోజుల్లోనే నయమవుతుంది. అసలెందుకు ఇలా జరుగుతుందనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? నిజానికి, నోటి పుండ్లు వివిధ కారణాల వల్ల సంభవిస్తుంటాయి.

1 / 5
నోటి పూతల వల్ల పుండ్లు వస్తుంటాయి. ఇది జ్వరం, హార్మోన్ల అసమతుల్యతత, మలబద్ధకం వంటి కారణాలతో సాధారణంగా వస్తుంటుంది. నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, జింక్ మొదలైన పోషకాలు లోపిస్తే నోటిలో పుండ్లు వస్తాయి. చాలా మంది సక్రమంగాలేని దంతాల కారణంగా బ్రేస్‌లు ధరించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు కూడా పుండ్లు వచ్చే ప్రమాదం ఉంది.

2 / 5
అయితే నోటి పుండ్లకు కారణం ఏమైనప్పటికీ.. ఇవి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. పులుపు, చేదు ఏదైనా తినడానికి ప్రయత్నిస్తే విపరీతమైన నొప్పి కలుగుతుంది. దీంతో నోటి మంటతో ఏమీ తినలేని పరిస్థితి తలెత్తుతుంది. దీని నుంచి ఉపశమనం ఎక్కువ నీరు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే నోటి పుండు ఉంటే ఉపశమనం పొందడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలిస్తే అల్సర్లు తగ్గుతాయి. ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు చేస్తే క్రమంగా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
గాయం మీద కొద్దిగా తేనె ఉంచినా ప్రయోజనం ఉంటుంది. ఇలా రోజు మొత్తంలో ప్రతి కొన్ని గంటలకొకసారి తేనెను రాసుకుంటే, గాయం త్వరగా మానుతుంది. అలాగే ప్రభావిత ప్రాంతంలో స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పూయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

4 / 5
గాయాలపై పేస్ట్ కూడా అప్లై చేయవచ్చు. పసుపులోని పోషకాలు కొద్ది రోజుల్లోనే సమస్యను అదుపు చేస్తుంది. లేదాంటే బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీటిలో కలిపి పుక్కిలిస్తే గాయాలు తగ్గుతాయి. లేదా బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి చిక్కటి పేస్ట్‌లా చేసి గాయంపై రాసినా మంచిదే. అయినా సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

5 / 5
Follow us