Handloom Sarees: నేతన్న సాంస్కృతిక వారసత్వం, కళా నైపుణ్యానికి నిదర్శనం.. మగువుల మనసు దోచే చేనేత చీరలు ఏమిటంటే
భారతీయ స్త్రీ అంటే బొట్టు, గాజులు, శరీరాన్ని నిండుగా కప్పి అందమైన శిల్పంలా కనిపించేలా చేసే చీరలు ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తాయి. ప్రపంచానికి భారతీయ స్త్రీలను బిన్నంగా పరిచయం చేస్తాయి. ఎన్ని రకాల దుస్తులు వచ్చినా మహిళల హృదయాలను ఆకట్టుకుని కట్టుకునేలా చేసేవి చీరలే. భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, హస్తకళా నైపుణ్యానికి నిదర్శనం చేనేత చీరలు. ఒక్కో రకమైన చేనేత చీర ఒకొక్క ప్రాంతాలకు చెందిన విభిన్న సంప్రదాయాలను ప్రతిబింభిస్తుంది. దాని అల్లికలు ములాంశాల ద్వారా ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది. ఈ సంప్రదాయ చేనేత వస్త్రాల కళాత్మకత, కలకాలం సాగే సొగసు కాల క్రమంలో గాడి తప్పింది. దీంతో స్వదేశీ ఉద్యమం మొదలై.. ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
