ఉమ్మి మసాజ్ చేస్తున్న బార్బర్.. స్వయంగా వీడియో చేసి వైరల్ చేసుకున్న బార్బర్

ఈ వీడియోను 15 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సెలూన్ వర్కర్ స్వయంగా తన మొబైల్ ఫోన్ నుంచి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ సంఘటనను స్పిట్ జిహాద్‌గా పేర్కొంటూ పోలీసులను ట్యాగ్ చేశారు.

ఉమ్మి మసాజ్ చేస్తున్న బార్బర్.. స్వయంగా వీడియో చేసి వైరల్ చేసుకున్న బార్బర్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 07, 2024 | 11:52 AM

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సెలూన్‌కి సంబంధించినది. దీనిలో సెలూన్ లో పని చేస్తున్న ఓ బార్బర్ ఉమ్ముతో మసాజ్ చేస్తున్నాడు. తన చేతిలో ఉమ్మి దానితో కస్టమర్ కు మసాజ్ చేస్తున్నాడు. ఈ వీడియో దాదాపు 15 రోజుల నాటిది. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కన్నౌజ్ పోలీసుల దృష్టికి ఈ వీడియో చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం సెలూన్ వర్కర్ షాపు మూసివేసి పరారీలో ఉన్నాడు. కన్నౌజ్ పోలీసుల కథనం ప్రకారం ఈ వీడియో నగరంలోని తాల్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిబ్రమౌ కూడలికి సమీపంలో ఉన్న సెలూన్‌కి సంబంధించినది.

ఈ వీడియోను 15 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సెలూన్ వర్కర్ స్వయంగా తన మొబైల్ ఫోన్ నుంచి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ సంఘటనను స్పిట్ జిహాద్‌గా పేర్కొంటూ పోలీసులను ట్యాగ్ చేశారు. నిందిత సెలూన్ బార్బర్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

సెలూన్ వర్కర్ కోసం పోలీసులు గాలింపు

ఈ ఘటనపై ఎస్పీ కన్నౌజ్ కేసు దర్యాప్తును ట్రైనీ సీఓ కపూర్ కుమార్‌కు అప్పగించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెలూన్ వర్కర్ పరారీలో ఉన్నాడు. అందుకే అతని కోసం పోలీసులు నిరంతరం గాలిస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి చాలా కేసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మి రొట్టె కాల్చడం, ఆహారంలో ఉమ్మివేయడం వరకు అనేక సంఘటనలు ఉన్నాయి. అయితే తొలిసారిగా ఉమ్మితో మసాజ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..