Keto Diet: బరువు తగ్గడం కోసం కీటో డైట్ ఫాలో అవుతున్నారా..! ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని తెలుసా..!
కీటో డైట్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరగడం మొదలవుతుంది అంటూ చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. బరువు తగ్గడం కోసం మీరు ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టె ఈ కీటో డైట్ మిమ్మల్ని మరణానికి దగ్గరకు చేస్తుంది. కీటో డైట్‌లో బ్రెడ్, రైస్, పాస్తా మాత్రమే కాదు మొక్కజొన్న , బీన్స్ వంటి పిండి పదార్ధాలున్న ఆహారాన్ని తినడం నిషేధించబడింది.
బరువు తగ్గడానికి అనేక రకాల డైట్ ప్లాన్‌లను అనుసరిస్తున్నారు. వాటిలో కీటో జెనిక్ డైట్ చాలా ప్రధానమైంది. దీన్నే ‘కీటో’ డైట్ అని కూడా అంటారు. అయితే ఈ విభిన్నమైన ఆహారం శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందని మీకు తెలుసా. డైలీ మెయిల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ డైట్ ప్లాన్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అదే సమయమలో ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అంతే కాదు కీటో డైట్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరగడం మొదలవుతుంది అంటూ చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. బరువు తగ్గడం కోసం మీరు ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టె ఈ కీటో డైట్ మిమ్మల్ని మరణానికి దగ్గరకు చేస్తుంది. కీటో డైట్‌లో బ్రెడ్, రైస్, పాస్తా మాత్రమే కాదు మొక్కజొన్న , బీన్స్ వంటి పిండి పదార్ధాలున్న ఆహారాన్ని తినడం నిషేధించబడింది.
జైపూర్‌కు చెందిన డైటీషియన్ సుర్భి పరీక్ మాట్లాడుతూ పిండి పదార్థాలను పూర్తిగా తీసుకోవడం మానేస్తే అది మనం చేసే తప్పు అని అంటున్నారు. రోజు వారీ దినచర్యలో సాధారణ కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కీటో డైట్ మన ఆరోగ్యానికి ఎలా శత్రువు అవుతుంది? అనే విషయం గురించి తెలుసుకుందాం..
కీటో డైట్ అంటే ఏమిటి?
ఈ ప్రత్యేకమైన డైట్ లో తినే ఆహారంలో తక్కువ పిండి పదార్థాలు ఉండేలా చూసుకుంటారు. అంతే కాకుండా ప్రొటీన్లను కూడా మితంగా తీసుకోవాలి. ఇందులో 75 శాతం కొవ్వు, 20 శాతం ప్రోటీన్, 5 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే 30 శాతం కొవ్వు, 15 శాతం ప్రొటీన్లు, 55 శాతం పిండి పదార్థాలు తినాలని NHS చెబుతోంది. కీటో డైట్‌లో ఉన్న వ్యక్తులు రోజుకు 20 నుండి 50 గ్రాముల కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. ఇది బరువు తగ్గడంలో సహాయపడినప్పటికీ, కార్బోహైడ్రేట్లను నిరంతరం తీసుకుంటే.. శరీరంలో ఒకటి కాదు, అనేక సమస్యలు పెరుగుతాయి.
అధ్యయనం ఏం చెబుతోందంటే
యూనివర్శిటీ ఆఫ్ బాత్‌లో ఈ పరిశోధన జరిగింది. ఇందులో దాదాపు 57 మందిని చేర్చారు. వీరిని తక్కువ పిండి పదార్థాలు, తక్కువ చక్కెర ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. పరిశోధకులు ప్రజలు 4 వారాల పాటు కీటో డైట్ , తక్కువ షుగర్ డైట్‌ని అనుసరించేలా చేసారు. ఈ సమయంలో కీటో డైట్‌లో ఉన్నవారు 2.9 కేజీలు, తక్కువ షుగర్ డైట్ ఉన్నవారు 2.1 కేజీలు తగ్గారు. తక్కువ పిండి పదార్థాలు తీసుకునేవారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిందని నిపుణులు గుర్తించారు. తక్కువ షుగర్ ఉన్నవారి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గింది.
అత్యంత దిగ్భ్రాంతికరమైన వెల్లడి ఏమిటంటే ఈ ఆహారం కారణంగా గట్ ఆరోగ్యానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా అయిన బిఫిడోబాక్టీరియం స్థాయి తగ్గింది. అటువంటి పరిస్థితిలో వీరు పేలవమైన జీర్ణవ్యవస్థ తో ఇబ్బంది పడడం మొదలు పెట్టారు. ఈ బ్యాక్టీరియా ప్రోబయోటిక్ చికిత్సకు ముఖ్యమైనది. ఎందుకంటే ఇది B విటమిన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా కీటో డైట్‌లో ఉన్న వ్యక్తులు మళ్లీ సాధారణ ఆహారాన్ని తినడం ప్రారంభించినప్పుడు.. వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరిగిందని చెప్పారు. ఈ ఆహార విధానం చూస్తే భవిష్యత్తులో ఈ డైట్ చేస్తున్న వారు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
నష్టం ఎలా జరుగుతుంది?
వాస్తవానికి మనం పిండి పదార్థాలు తీసుకోనప్పుడు మన శరీరం శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును కాల్చడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా బరువు తగ్గడం ప్రారంభం అవుతుంది. అయితే ఇలా ఎక్కువ కాలం జరగకూడదు. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఆరోన్ హెంగిస్ట్ మాట్లాడుతూ.. ‘కీటోజెనిక్ ఆహారం కూడా మన రక్తంలో చెడు కొవ్వుల స్థాయిని పెంచుతుంది. ఇలా నిరంతరం జరిగితే ఇది గుండె సంబంధిత వ్యాధులకు లేదా హార్ట్ స్ట్రోక్ ప్రమాదానికి కూడా దారి తీస్తుంది.
డైలీ మెయిల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ రస్సెల్ డేవిస్ మాట్లాడుతూ ఈ ఆహారం వల్ల మనం రోజువారీ ఫైబర్ తీసుకునే శాతంలో 15 గ్రాములు తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, బైఫిడోబాక్టీరియం దెబ్బతింటుంది. దీంతో కడుపు సంబంధిత సమస్యలు, ప్రేగులలో మంట, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వంటి ఇబ్బందులకు గురవుతారు. కనుక ఎవరైనా బరువు తగ్గాలనుకుని కీటో డైట్ ని ఫాలో అవుతుంటే జీవక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.
మరిని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..