AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ నేచురల్ డ్రింక్స్‌తో ఒక్క వారంలో పొట్ట కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..!

రాత్రిపూట ఒక చెంచా మెంతులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే, మీరు ఆరోగ్యకరమైన బరువు తగ్గడంతో పాటు పొట్టను కరిగించుకోవచ్చు. అలాగే, రోజూ పుదీనా నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్యలు దూరమై జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాదు పొట్ట కూడా కొద్దిరోజుల్లో ఫ్లాట్ అయిపోతుంది.

జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ నేచురల్ డ్రింక్స్‌తో ఒక్క వారంలో పొట్ట కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..!
Drinks To Reduce Weight Melt Belly Fat
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2024 | 9:58 PM

Share

అధిక బరువు, ఊబకాయం అనేది ప్రస్తుతం చాలా మందిని వెధిస్తున్న ప్రధాన సమస్య. బరువు తగ్గించుకోవడం కోసం చాలా మంది ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారం, వ్యాయామం, వాకింగ్‌ పేరుతో పడరాని పాట్లు పడుతుంటారు. అయినప్పటికీ అనుకున్న మేరకు బొడ్డు కొవ్వు కరగకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కానీ, కొన్ని ఇంటి నివారణలు మీ బొడ్డు కొవ్వును ఈజీగా కరిగిస్తాయని తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. ఇంట్లో తయారు చేసుకునే కొన్ని సహజ డ్రింక్స్‌ సహాయంతో మీ పని చాలా సులభం అవుతుంది.

బరువు తగ్గించుకునే వారికి యోగా, వ్యాయామం, జిమ్ తప్పనిసరి అయినప్పటికీ, వీటిలో ఏవీ లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చు. కొన్ని సహజ డ్రింక్స్‌ మహిళలకు పెను సవాలుగా ఉండే పొట్ట కొవ్వును కరిగించడానికి ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాల జీడిపప్పు పొడిని కలుపుకుని రోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల కడుపులో పేరుకున్న కొవ్వు వెన్నలా కరిగిపోతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి రోజూ తాగితే వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. రోజూ ఉదయాన్నే అల్లం ముక్కతో చేసిన కషాయాన్ని తాగితే కొద్ది రోజుల్లోనే పొట్టలోని కొవ్వు మాయమవుతుంది.

ఇవి కూడా చదవండి

రాత్రిపూట ఒక చెంచా మెంతులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే, మీరు ఆరోగ్యకరమైన బరువు తగ్గడంతో పాటు పొట్టను కరిగించుకోవచ్చు. అలాగే, రోజూ పుదీనా నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్యలు దూరమై జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాదు పొట్ట కూడా కొద్దిరోజుల్లో ఫ్లాట్ అయిపోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..