AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసుపు రంగు దంతాలతో ఇబ్బందిపడుతున్నారా..? ఇలా చేస్తే మీ చిరునవ్వులో మెరుపు ఖాయం..!!

అయితే, పళ్లపై పేరుకుపోయిన పసుపు రంగును తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభం ఉండదు. కానీ, ఇంట్లో లభించే కొన్ని పదార్థాలు ఉపయోగించడం వల్ల మీ దంతాలు తెల్లగా ముత్యాల్ల మెరుస్తాయి. అంతేకాదు.. చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అలాంటి పదార్థాలేవో ఇక్కడ తెలుసుకుందాం..

పసుపు రంగు దంతాలతో ఇబ్బందిపడుతున్నారా..? ఇలా చేస్తే మీ చిరునవ్వులో మెరుపు ఖాయం..!!
Teeth
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2024 | 9:05 PM

Share

తెల్లటి ముత్యాల్లాంటి దంతాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, కొందరికీ పళ్లు పసుపు పచ్చగా మారుతుంటాయి. ఇలాంటి పళ్ల కారణంగా వారు నలుగురిలో నవ్వడానికి కూడా వెనుకాడతారు. మనం తినే ఆహారాలు, తాగే పానీయాలు, వయస్సు కారణంగా దంతాల సమస్యలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అయితే, పళ్లపై పేరుకుపోయిన పసుపు రంగును తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభం ఉండదు. కానీ, ఇంట్లో లభించే కొన్ని పదార్థాలు ఉపయోగించడం వల్ల మీ దంతాలు తెల్లగా ముత్యాల్ల మెరుస్తాయి. అంతేకాదు.. చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అలాంటి పదార్థాలేవో ఇక్కడ తెలుసుకుందాం..

ఉప్పు..

ఉప్పును ఉపయోగించి పళ్లపై పేరుకుపోయిన మరకలను తొలగించుకోవచ్చు.ఇందుకోసం కొద్దిగా ఉప్పు వేలితో తీసుకుని దంతాలను తోముకోవడం వల్ల పసుపు రంగు తొలగిపోయి తెల్లని రంగు వస్తుంది. సుమారు 1-2 నిమిషాలు ఉప్పుతో మీ దంతాలను బ్రష్ చేయండి.  అంతేగానీ, పళ్లను గట్టిగా రుద్దకుండా జాగ్రత్తగా తోముకోవాలి.. ఎందుకంటే ఎక్కువ గట్టిగా బ్రష్ చేయడం వల్ల పంటి ఎనామిల్, చిగుళ్లు దెబ్బతింటాయి. బ్రష్ చేసిన తర్వాత మీ నోటిని నీటితో బాగా కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల దంతాలకు రంగు వస్తుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనె పుల్లింగ్ కూడా నోటిని శుభ్రపరుస్తుంది. చిగుళ్ళ ఆరోగ్యానికి మంచిది. పుసుపు దంతాలు తెల్లగా మారుతాయి. మీ నోటిలో నూనె పోసుకున్న తర్వాత, 10-20 నిమిషాల పాటు పుక్కిల్లించాలి.. ఇది నోటిలోని అన్ని భాగాలకు చేరేలా చూసుకోవాలి. ఇందుకోసం మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ కూడా చిగుళ్ల పరిశుభ్రత, పసుపు దంతాలను తొలగించి తెల్లబడటంలో సహాయపడటానికి సహజ మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. రోజుకు రెండుసార్లు ఆపిల్ సైడర్ వెనిగర్ నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగకుండా కాపాడుతుంది.

దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడేందుకు బేకింగ్ పౌడర్, నిమ్మరసం కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ కొద్దిగా తీసుకుని దంతాల మీద బాగా రుద్ది 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత కడగాలి. ఇది దంతాల రంగును తెల్లగా మార్చేయడానికి సహాయపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..