AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్లో మరో డైట్…’డుకన్ డైట్’ ఈజీగా బరువు తగ్గాలనుకునే వారికి.. స్పెషాలిటీ ఏంటంటే.?

స్టెబిలైజేశన్ ఫేజ్.. కోరుకున్నంత బరువు తగ్గగానే ఈ దశ కొనసాగిస్తూ వెళ్ళవచ్చు. ఇక్కడ మరి నోరు కట్టుకోవాల్సిన పని ఉండదు. లీన్ ప్రోటీన్ లను వారానికోసారి తీసుకోవచ్చు. వారంలో రెండు మూడు సార్లు అన్నం ఇతర తీపి పదార్థాలు, రోజూ పండ్లు కాయగూరలు తినొచ్చు. అయితే రోజు మూడు పౌండ్ల ఓట్ బ్రాన్ తప్పనిసరి. నచ్చినవన్నీ తినమన్నారు కదా అని ఇష్టానుసారం లాగిస్తే బరువు పెరుగుతారు.

మార్కెట్లో మరో డైట్...'డుకన్ డైట్' ఈజీగా బరువు తగ్గాలనుకునే వారికి.. స్పెషాలిటీ ఏంటంటే.?
Dukan Diet
Yellender Reddy Ramasagram
| Edited By: Jyothi Gadda|

Updated on: Aug 06, 2024 | 6:49 PM

Share

బరువు తగ్గడానికి మనలో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిలో ఎక్కువమంది వివిధ డైట్ లను పాటిస్తుంటారు. అయితే ఈ మధ్యన అంతర్జాతీయ సెలెబ్రిటీలు సైతం పాటిస్తున్న డుకన్ డైట్ పై ఇప్పుడు అందరి చూపు పడింది. ఇంతకీ ఏమిటి ఈ డైట్ స్పెషాలిటీ.ఎక్కువ ప్రోటీన్ తక్కువ మొత్తం కార్బోహైడ్రేట్ ఈ డైట్ ప్రధాన సూత్రం ఇంకా ఇది నాలుగు దశల్లోను సాగుతుంది అదేంటంటే.. అటాక్ ఫేజ్, క్రూయిజ్ ఫేజ్,కన్సలిడేషన్ ఫేజ్,స్టెబిలైజేశన్ ఫేజ్.

అటాక్ ఫేజ్.. ఇది వారం రోజులు ఉంటుంది. ఈ సమయంలో లీన్ ప్రోటీన్ కె ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే స్కిన్లెస్ చికెన్, గుడ్లు, చేప, సోయాలతో పాటు కొవ్వులేని పాలు, పెరుగు, చీజ్ వంటివి తినొచ్చు. ఇన్ని రోజులు నూనె స్పూన్ కి మించకుండా వాడాలి. కూరగాయలు, పండ్లు, కొవ్వులు చక్కెరలను అసలు దగ్గరికి రానివ్వకూడదు. అందుకే స్పూన్ వరకు ఓట్ బ్రాన్ తినొచ్చు. వీటితోపాటు రోజు 8 క్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.

క్రూయిజ్ ఫేజ్… ఈ డైట్ 12 నెలల వరకు ఉంటుంది ఈ సమయంలో పిండి పదార్థాలు లేని కాయగూరలు, ఆకుకూరలు, దుంపలు, మష్రూమ్స్, ఉల్లి, బ్రకలి, క్యాలీఫ్లవర్ అంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకరోజు లీన్ ప్రోటీన్ డైట్ తీసుకుంటే మరో రోజు కాయగూరలను తీసుకోవాలి. ఓట్ బ్రాండ్, రెండు స్పూన్ల నూనెని తీసుకోవచ్చు. పండ్లు బంగాళదుంప మొక్కజొన్న గోధుమ వరి బార్లీ మిల్లెట్లు చక్కెర వంటివి తినకూడదు.

ఇవి కూడా చదవండి

కన్సలిడేషన్ ఫేజ్..బరువు తగ్గడం మొదలయ్యాక ఇది ప్రారంభమవుతుంది. అరకేజీ తగ్గిన ప్రతిసారి దీన్ని పాటించాలి. ఇది ఐదు రోజులు ఉంటుంది. ఈ సమయంలో లీన్ ప్రోటీన్లు పిండి పదార్థాలు లేని కాయగూరలతో పాటు కార్బోహైడ్రేట్స్ కొవ్వు ఉన్న పదార్థాలు, ఒక పండుని తీసుకోవచ్చు. ఒకరోజు రైస్ నచ్చిన ఆహారాలు తీసుకోవచ్చు. రెండు స్పూన్ల ఓట్ బ్రాండ్ రోజూ తప్పనిసరి. అయితే తీపి పదార్థాలు, అరటి, ద్రాక్ష చెర్రీస్ కు అనుమతి ఉండదు. ఈ సమయంలో రోజు కనీసం 25 నిమిషాలు ఏదైనా వ్యాయామం తప్పనిసరి.

స్టెబిలైజేశన్ ఫేజ్.. కోరుకున్నంత బరువు తగ్గగానే ఈ దశ కొనసాగిస్తూ వెళ్ళవచ్చు. ఇక్కడ మరి నోరు కట్టుకోవాల్సిన పని ఉండదు. లీన్ ప్రోటీన్ లను వారానికోసారి తీసుకోవచ్చు. వారంలో రెండు మూడు సార్లు అన్నం ఇతర తీపి పదార్థాలు, రోజూ పండ్లు కాయగూరలు తినొచ్చు. అయితే రోజు మూడు పౌండ్ల ఓట్ బ్రాన్ తప్పనిసరి. నచ్చినవన్నీ తినమన్నారు కదా అని ఇష్టానుసారం లాగిస్తే బరువు పెరుగుతారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..