AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్య రంగంలో మరో అద్భుతం.. 5వేల కిలోమీటర్ల నుంచి సర్జరీ..! రోగి ఊపిరితిత్తుల కణతిని తొలగించిన వీడియో వైరల్..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఈ శస్త్రచికిత్స వీడియోను పోస్ట్ చేశారు. వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగి కణితిని ఎలా తొలగించాడో నిజంగా షాకింగ్‌గా ఉందన్నారు. ఈ మొత్తం ఆపరేషన్ గంటలోపే పూర్తి కావటం కూడా మరింత ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

వైద్య రంగంలో మరో అద్భుతం.. 5వేల కిలోమీటర్ల నుంచి సర్జరీ..! రోగి ఊపిరితిత్తుల కణతిని తొలగించిన వీడియో వైరల్..
China Surgeons
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2024 | 4:42 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా తన టెక్నాలజీని నిరూపించుకున్న చైనా.. ఆరోగ్య రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది. చైనాలోని షాంఘైలో 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి డాక్టర్ విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. చైనాలోని షాంఘై చెస్ట్ హాస్పిటల్‌కు చెందిన ఒక వైద్యుడు, తన సహోద్యోగులతో కలిసి ఇంట్లో తయారు చేసిన 5G సర్జికల్ రోబోట్‌ను ఉపయోగించి రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో ఆపరేషన్ నిర్వహించాడు. డాక్టర్‌కు దాదాపు 5000 కి.మీ దూరంలో ఉన్న వ్యక్తికి జరిగిన ఈ ఆసక్తికరమైన ఆపరేషన్‌లో విజయం సాధించారు. జూలై 13న డాక్టర్ ఈ సర్జరీ చేశారు.

ఈ చారిత్రాత్మక ఆపరేషన్ సమయంలో డాక్టర్ షాంఘైలో ఉండగా, రోగి, ఆపరేషన్‌ చేసిన రోబోట్ షాంఘైకి 5000 కిలోమీటర్ల దూరంలో చైనాలోని కష్గర్‌లో ఉన్నారు. ఈ సర్జరీ కోసం డాక్టర్‌కు కేవలం ఒక 1 గంట మాత్రమే పట్టిందని తెలిసింది. సర్జికల్‌ రోబోటిక్‌ ఇంజినీరింగ్‌తో చేపట్టిన ఈ ఆపరేషన్‌ విజయవంతం కావడంతో రోగులు ఇకపై తమ స్వస్థలాల నుంచి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఉన్నత స్థాయి వైద్య సేవలను పొందవచ్చని ఆపరేషన్‌ హెడ్‌ డాక్టర్‌ లువో క్వింగ్‌క్వాన్‌ తెలిపారు. ఈ శస్త్రచికిత్స విజయం దేశీయంగా తయారు చేయబడిన శస్త్రచికిత్స రోబోట్ క్లినికల్ సామర్థ్యాన్ని చూపించడానికి ఒక మైలురాయి.

ఇవి కూడా చదవండి

చైనా వార్తాపత్రిక షాంఘై డైలీ ప్రకారం, రోబోల సహాయంతో ఊపిరితిత్తుల శస్త్రచికిత్స చేయగల చైనాలోని మొదటి వైద్య సంస్థ ఇదేనని ప్రకటించారు. చైనాలో అత్యధిక శస్త్రచికిత్సలు చేసే ఆసుపత్రి కూడా ఇదే. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఈ శస్త్రచికిత్స వీడియోను పోస్ట్ చేశారు. వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగి కణితిని ఎలా తొలగించాడో నిజంగా షాకింగ్‌గా ఉందన్నారు. ఈ మొత్తం ఆపరేషన్ గంటలోపే పూర్తి కావటం కూడా మరింత ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

రోబోల ద్వారా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం మన దేశంలో కూడా ఉంది. భారతదేశంలో స్వదేశీ శస్త్రచికిత్స రోబోట్ వ్యవస్థను కలిగి ఉంది. దీనిని డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ అభివృద్ధి చేశారు. రోగి సమీపంలో ఉన్నా లేకపోయినా శస్త్రచికిత్స చేయడానికి ఇది వైద్యులకు సహాయపడుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..