AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. విచారణలో దిమ్మతిరిగే ట్విస్ట్…

పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ చంద్రకుమార్ వచ్చారు. అతను పామును కింగ్ కోబ్రాగా గుర్తించాడు. చంద్రకుమార్ పామును పట్టుకునే క్రమంలో అది అతన్ని కాటేసింది. వెంటనే పాము కాటుకు గురైన చంద్రకుమార్ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లగా అక్కడ చికిత్స అనంతరం అతడు కొలుకున్నాడు. కానీ, అతన్ని కాటేసిన కింగ్‌ కోబ్రో మాత్రం మృతి చెందింది.

స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. విచారణలో దిమ్మతిరిగే ట్విస్ట్...
King Cobra
Jyothi Gadda
|

Updated on: Aug 05, 2024 | 10:00 PM

Share

విషపూరిత పాము ఎవరినైనా కాటేస్తే, సరైన సమయానికి వైద్యం అందలేదంటే.. ఆ వ్యక్తి మరణం ఖాయమని మన అందరికీ తెలిసిందే. అయితే, పాము మనిషిని కాటేసి మనిషికి బదులు పాము చనిపోవడం ఎక్కడైన చూశారా..? నమ్మలేకపోతున్నారు కదూ..! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అలాంటి ఉదంతం మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. ఒక వ్యక్తిని నాగు నాగుపాము కరిచింది. కానీ ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు. కింగ్ కోబ్రా మరణించింది. దీని వెనుక కారణం ఏంటంటే..

ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగింది. . సాగర్‌లోని నారాయవలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రోడ్డుపై పాము కనిపించింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ చంద్రకుమార్ వచ్చారు. అతను పామును కింగ్ కోబ్రాగా గుర్తించాడు. చంద్రకుమార్ పామును పట్టుకునే క్రమంలో అది అతన్ని కాటేసింది. వెంటనే పాము కాటుకు గురైన చంద్రకుమార్ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లగా అక్కడ చికిత్స అనంతరం అతడు కొలుకున్నాడు. కానీ, అతన్ని కాటేసిన కింగ్‌ కోబ్రో మాత్రం మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఈ విషయం పోలీసులకు చేరడంతో పోలీసులు విచారించగా అసలు కారణం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన 14 రోజుల తర్వాత పాము ఎలా చనిపోయిందో పోలీసులు గుర్తించారు.

పాము కాటుకు గురైన స్నేక్‌క్యాచర్‌ చంద్రకుమార్ ఆసుపత్రికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అతడికి ట్రీట్‌మెంట్ అక్కడ మొదలైందో కానీ, ఇక్కడ ఊరి జనం మాత్రం పామును వెంటాడటం మొదలుపెట్టారు. ఎట్టకేలకు పామును పట్టుకుని ప్లాస్టిక్ బాక్సులో సీల్ చేశారు. ఊపిరాడక పాము మృతి చెందింది. ఆ తర్వాత మనిషిని కాటేసి పాము చనిపోయిందనే ప్రచారం సాగింది. ఇదే విషయమై స్థానికంగా పెద్ద ఎత్తున పుకార్లు వ్యాపించడంతో విషయం పోలీసుల వరకు చేరింది. స్నేక్ క్యాచర్ చంద్రకుమార్‌ను పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్