స్కూల్‌కి వెళ్లే మూడ్ లేక బాలుడు ఏం చేశాడో తెలిస్తే
శుక్రవారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాల సహా మొత్తం మూడు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దాంతో స్కూల్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసి అలాంటిదేమీ లేదని తేల్చారు. కాగా ఈ బాంబ్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తాజాగా పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడిని అనుమానితుడిగా గుర్తించామని చెప్పారు.
శుక్రవారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాల సహా మొత్తం మూడు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దాంతో స్కూల్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసి అలాంటిదేమీ లేదని తేల్చారు. కాగా ఈ బాంబ్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తాజాగా పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడిని అనుమానితుడిగా గుర్తించామని చెప్పారు. స్కూల్‌కు వెళ్లే మూడ్ లేక బాలుడు ఈ పని చేశాడని వివరించారు. దర్యాప్తులో బాలుడు ఈ విషయాలను ఒప్పుకున్నాడని తెలిపారు. తాను పంపిన ఈ-మెయిల్ నమ్మదగినదిగా ఉండేందుకు మరో రెండు స్కూళ్లకు కూడా మెయిల్స్ పంపించినట్టు ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ పాఠశాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో స్కూల్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రమాదం లేదని తేల్చారు. అర్ధరాత్రి సమయంలో పాఠశాలకు మెయిల్ వచ్చిందని, పాఠశాల ఆవరణలో బాంబు పెట్టినట్లు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారని అధికారులు పేర్కొన్నారు. బాంబు స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏమీ లేదని తేల్చిందని వివరించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్కసారిగా కుంగిపోయిన ఇంట్లోని భూమి.. 20 అడుగుల లోతులో పడ్డ మహిళ..
ఈసారి ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు ఎంతో తెలుసా ??
అండర్ గ్రౌండ్‌లో గ్రహాంతరవాసి ఆలయం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Nayanthara: వయనాడ్ బాధితులకు నయనతార, విఘ్నేశ్ దంపతుల విరాళం
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

