దోమలు కొందరిని మాత్రమే ఎందుకు కుడతాయో తెలుసా..? కారణం ఇదేనట..!

అలాగే లేత రంగు దుస్తులు ధరించడం వల్ల దోమల బారిన పడకుండా ఉంటారు. ఇకపోతే, దోమలు ఎక్కువగా కుట్టడానికి మరో ముఖ్య కారణం కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ఉన్న మనుషులను ఇతరుల కంటే ఎక్కువగా కుడుతుంటాయిని నిపుణులు చెబుతున్నారు. ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే 'O' బ్లడ్ గ్రూప్ ఉన్న మనుషులు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తారని నిపుణులు అంటున్నారు..

దోమలు కొందరిని మాత్రమే ఎందుకు కుడతాయో తెలుసా..? కారణం ఇదేనట..!
mosquitoes
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 05, 2024 | 9:21 PM

మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మనతో పాటుగా అనేక జీవరాశులు నివసిస్తున్నాయి. అందులో దోమలు కూడా ఒకటి. దోమలలో కూడా మనుషుల మాదిరిగా ఆడ,మగ దోమలు రెండూ ఉన్నాయి. మగ దోమలు పువ్వుల నుండి తేనెను తీసుకుంటాయి… ఆడ దోమలు ఆహారం కోసం మనుషులను కుడతాయని మీకు తెలుసా..? . దోమలు గుడ్లను ఉత్పత్తి చేయడానికి మానవ రక్తంలోని కొన్ని ప్రోటీన్లను ఉపయోగిస్తాయి. మనిషిని కుట్టే ఈ ప్రక్రియలో ఆడ దోమ లాలాజలాన్ని మానవ రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఇది మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్ ఇన్‌ఫెక్షన్‌లు మొదలైన వివిధ వెక్టర్-బర్న్ ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుంది. వెక్టర్ ద్వారా సంక్రమించే అంటువ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మరణాలకు కారణమవుతాయి. అసలే ఇది వర్షాకాలం దోమల బెడద మరీ ఎక్కువగా ఉంటోంది. అయితే, దోమలు మనలో కొందరిని మాత్రమే ఎక్కువగా కుడుతుంటాయి. దానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..?

దోమలు కుట్టడానికి ప్రధాన కారణం మనం ధరించే బట్టలు, ఎందుకంటే, దోమలు లేత రంగుల కంటే ముదురు రంగు దుస్తులకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అలాగే హాఫ్ స్లీవ్ బట్టలు, పొట్టి బట్టలు ధరించడం వల్ల కూడా దోమలు కుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే ఏడిస్ దోమ కాళ్లను కాకుండా చేతులను ఎక్కువగా కుడుతుందట.

ఇక, మలేరియాకు కారణమయ్యే అనాఫిలిస్ జాతికి చెందిన దోమలు కాళ్లపై కుట్టడానికి ఇష్టపడతాయి. కాబట్టి, వర్షాకాలంలో ఫ్లూ అంటువ్యాధుల సమయంలో పూర్తిగా దుస్తులు ధరించడం మంచిది. అలాగే లేత రంగు దుస్తులు ధరించడం వల్ల దోమల బారిన పడకుండా ఉంటారు. ఇకపోతే, దోమలు ఎక్కువగా కుట్టడానికి మరో ముఖ్య కారణం కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ఉన్న మనుషులను ఇతరుల కంటే ఎక్కువగా కుడుతుంటాయిని నిపుణులు చెబుతున్నారు. ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్న మనుషులు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తారని నిపుణులు అంటున్నారు..

ఇవి కూడా చదవండి

ఇక, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. అలాగే, చెమట పెరుగుతుంది. ఈ కారకాలన్నీ ఆడ దోమలకు అత్యంత ఆకర్షణీయంగా పనిచేస్తాయని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.