నిమిషంలో ఆవిరైన ఆనందం.. రిటైర్మెంట్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన టీచర్..
అర్ధరాత్రి 12 గంటల సమయంలో మరో పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు మన్నారామ్ జఖర్. ఆ తర్వాత రెండు నిమిషాలకే అతను గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబసభ్యులు 10 నిమిషాలపాటు సీపీఆర్ చేసినా కదలిక లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే, మన్నారామ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Heart attack : మరణంపై ఎవరికీ నియంత్రణ లేదన్న మాట అక్షర సత్యం. ఎందుకంటే, ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు. మరణం వస్తే ఎవరూ ఊహించని విధంగా వస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ పదవీ విరమణ సమయంలోనే ఊహించని రీతిలో ఆ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాకు చెందినదిగా తెలిసింది. ఇదే జిల్లాకు చెందిన కిష్ణగఢ్-రెన్వాల్ ఏరియాకు చెందిన గవర్నమెంట్ టీచర్ మంగల్ జఖర్ ఇటీవల పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు స్థానిక ఆలయంలో వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తమ దగ్గరి బంధువులను ఆహ్వానించారు. మంగల్ జఖర్ సొంత తమ్ముడు మన్నారామ్ జఖర్ కుటుంబం కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నది. మన్నారామ్ జఖర్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. జోధ్‌పూర్‌లోని జూడ్ గ్రామంలో ఆయన టీచర్‌గా పనిచేస్తున్నారు. అన్న రిటైర్‌మెంట్ వేడుకల్లో పాల్గొనేందుకు కిష్ణగఢ్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వేడుకలు మొదలుకాగానే మన్నారామ్ జఖర్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత ఇతర కుటుంబసభ్యులు డ్యాన్స్ చేస్తుంటే కూర్చుని చూశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మరో పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు మన్నారామ్ జఖర్. ఆ తర్వాత రెండు నిమిషాలకే అతను గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబసభ్యులు 10 నిమిషాలపాటు సీపీఆర్ చేసినా కదలిక లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే, మన్నారామ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మన్నారామ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..