Watch: ఫిల్మ్ హబ్‌గా మారిన పవన్ అడ్డా.. పిఠాపురానికి సినిమా వాళ్ల క్యూ
ఇప్పుడు ఎన్టీఆర్ బావమరిది, మ్యాడ్ ఫెమ్ సినిమా హీరో నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన ఆయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ లాంచ్ ఇక్కడే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన ఇన్చార్జి, శ్రీనివాస్ చేతుల మీదగా ప్రారంభించారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేయడం, రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందిన నాటి నుంచి కాకినాడ జిల్లా పిఠాపురం పేరు దేశావ్యాప్తంగా మారుమ్రాగుతుంది.. తరచూ అనేక రాష్ట్ర స్థాయి విషయాలకు వేదికగా మారి నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఎన్నికల ముందు వరకు ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన పిఠాపురం ఇప్పుడు సినిమా వాళ్లు చూపు కూడా పిఠాపురం వైపే పడింది.. గత కొద్దిరోజులు క్రితం శర్వానంద్ నటించిన మనమే సినిమా ఈవెంట్ ను ఇక్కడే నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాలతో అనుమతులు రాకపోవడంతో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది.. అటువంటి తరుణంలో ఇప్పుడు ఆయ్ అనే ఒక సినిమా ఈవెంట్ కు వేదికైయింది… గత వారం మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఇక్కడకు వచ్చి తన కమిటీ కుర్రాళ్లు సినిమా నటులతో ఇక్కడి పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇప్పుడు ఎన్టీఆర్ బావమరిది, మ్యాడ్ ఫెమ్ సినిమా హీరో నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన ఆయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ లాంచ్ ఇక్కడే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన ఇన్చార్జి, శ్రీనివాస్ చేతుల మీదగా ప్రారంభించారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కె.మణిపుత్ర కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ ట్రైలర్ పిఠాపురంలో విడుదల చేసిన మొట్టమొదటి టైలర్ గా చరిత్రలో నిలిచింది.
15న విడుదల కాబోతున్న ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ని గెలిపించి తెలుగు ఇండస్ట్రీకి చాలా ఇచ్చిందని దాన్ని తిరిగి ఇచ్చే భాగంలో మొట్టమొదటి అడుగు నేను వేశానని రానున్న రోజుల్లో అనేక సినిమా కార్యక్రమాలు పిఠాపురం వేదికగా జరగబోతున్నాయని తెలిపింది చిత్ర యూనిట్…. ఇక పర్యటకంగానూ సినిమా రంగం గానూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తానని ఒకపక్క మంత్రి కందులు దుర్గేష్ కూడా చెప్పడంతో అందరూ చూపు ఇప్పుడు పిఠాపురం వైపు పడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..