Watch: మందల్లోంచి గొర్రె మిస్సింగ్..! ఎటుపోయిందా అని వెతుకుతుండగా పొదల్లోంచి ఏదో శబ్ధం..! షాకింగ్ వీడియో వైరల్..
ఎదురుపడిన జీవిని వెంటనే కాటేసి, ఆపై శరీరం మొత్తాన్ని చుట్టుకొని వాటిని చంపేస్తాయి. తర్వాత మింగేస్తాయి. అడవిలో ఒకటి బతకాలంటే మరొక జీవి ఆహారం అవ్వక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం.. కాబట్టే మనుషులు కూడా వాటి మనుగడలో జోక్యం చేసుకోరు. అయితే తాజాగా, ఆదిలాబాద్ జిల్లాలో భారీ కొండచిలువ ఒక గొర్రెను చుట్టేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అనకొండ, కొండచిలువ వంటి పాములు, కోతులు, మేకలు, గొర్రెలు వంటివి దొరికితే ఇష్టంగా తింటుంటాయి. ఇవి నీటిలో, బండరాళ్లు, చెట్ల పొదల్లో దాక్కుని అదును చూసిన ఎరను వేటాడుతాయి. ఎదురుపడిన జీవిని వెంటనే కాటేసి, ఆపై శరీరం మొత్తాన్ని చుట్టుకొని వాటిని చంపేస్తాయి. తర్వాత మింగేస్తాయి. అడవిలో ఒకటి బతకాలంటే మరొక జీవి ఆహారం అవ్వక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం.. కాబట్టే మనుషులు కూడా వాటి మనుగడలో జోక్యం చేసుకోరు. అయితే తాజాగా, ఆదిలాబాద్ జిల్లాలో భారీ కొండచిలువ ఒక గొర్రెను చుట్టేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తర్ణం అటవీ సమీపంలో గొర్రెల కాపరి గొర్రెలు మెపుతుండగా భారీ కొండచిలువ మందలోంచి ఒక గొర్రెను చుట్టేసుకుంది. అది చూసిన కాపరి భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు.