AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meru Mega University Fair: మియాపూర్‌ మెరు క్యాంపస్‌లో మెగా యూనివర్సిటీ ఫెయిర్‌ 2024

మెరు ఇంటర్నేషనల్ స్కూల్... మెరు మెగా యూనివర్శిటీ ఫెయిర్‌ను 5 ఆగస్టు, 2024న నిర్వహించింది, ఈ కార్యక్రమానికి 40కి పైగా భారతీయ, 40 విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతినిధులు హాజరయ్యారు. విద్యార్థుల కెరీర్‌కు సంబంధించి పలు కీలకమైన అంశాలపై అవగాహన సమగ్ర కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 

Meru Mega University Fair: మియాపూర్‌ మెరు క్యాంపస్‌లో మెగా యూనివర్సిటీ ఫెయిర్‌ 2024
Meru Mega University Fair
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2024 | 5:21 PM

Share

జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెరు ఇంటర్నేషనల్ స్కూల్ మెరు మెగా యూనివర్సిటీ ఫెయిర్ 2024 పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. మియాపూర్ మెరు క్యాంపస్‌లో జరిగిన ఈ యూనివర్సిటీ ఫెయిర్‌లో 90కు పైగా జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. 9 నుండి 12వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. వివిధ యూనివర్సిటీ ప్రతినిధులను కలిసి అంతర్జాతీయ విద్యావిధానంపై తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. రాబోయే 10సంవత్సరాల తరువాత ఎటువంటి అవకాశాలు ఉంటాయి.. ఏఏ కోర్సులకు డిమాండ్‌ ఉంటుంది.. వివిధ యూనివర్శిటీల్లో స్కాలర్‌షిప్స్ ఎలా ఉంటాయ్.. ఆయా విశ్వవిద్యాలయాల్లో చదివితే ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి వంటి అంశాలపై ఈ ఫెయిర్ ద్వారా విద్యార్థులకు అవగాహన కలుగుతుందని మెరు యాజమాన్యం తెలిపింది.

ముఖ్య వక్తలు ఏమన్నారంటే….

GITAM హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ ఫకృద్దీన్ షేక్ విద్యార్థులలో ఎంటర్ఫ్యూనర్ స్కిల్స్ పెంపొందించడంపై ప్రధానంగా మాట్లాడారు. ఎంటర్ఫ్యూనర్‌గా ప్రజంట్ జనరేషన్‌లో సక్సెస్ అవ్వాలంటే.. ఎలాంటి స్కిల్స్ కావాలి.. మైండ్ సెట్‌ను ఎలా డిజైన్ చేసుకోవాలని అన్న అంశాలపై ఆయన ప్రసంగం సాగింది.

హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ తరుపున సదస్సుకు హాజరైన అభిషేక్ గణేష్ మాట్లాడుతూ.. వాతావరణంలో మార్పులూ… ప్రపంచ పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో ప్యూచర్ జనరేషన్ రోల్స్, జాబ్స్ ఎలా ఉంటాయి అనే అంశాలను హైలెట్ చేశారు.

బెంగుళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీకి చెందిన మిస్టర్ రాజగోపాల్ సీవీ… 21వ శతాబ్దపు వర్క్‌ఫోర్స్ ఏ విధంగా మార్పు చెందుతుంది.. ఈ ఆధునిక వృత్తిపరమైన ప్రపంచంలో నెగ్గుకురావడానికి విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు ఏంటి.. ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలని అన్న అంశాలపై సుధీర్ఘంగా మాట్లాడారు. పూణేలోని ఫ్లేమ్ యూనివర్శిటీకి చెందిన ప్రొ.షమిత్ శ్రీవాస్తవ్ డిజైన్ కెరీర్ ఫీల్డ్‌లోఅవకాశాలు గురించి వివరించారు.

ఇక మెరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విషయానికొస్తే అత్యాధునిక నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులకు మంచి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. హైదరాబాద్‌లోని మియాపూర్‌తోపాటు తెల్లపూర్‌లో మెరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కేంబడ్రిడ్జి, సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యను బోధిస్తున్నారు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో మెరు స్కూల్స్‌ ముందు వరుసలో ఉంటున్నాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..