AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బయటకు వెళితే తిరిగి, వస్తారా రారో.. హైదరాబాద్‌లో బాలుడి మిస్సింగ్ కలకలం.. ట్యూషన్‌కి వెళ్లి..

హైదరాబాద్ నగరంలో అలజడి.. పిల్లలు ఇంటినుంచి బయటకు వెళితే, తిరిగి వస్తారా రారా అన్న టెన్షన్‌ కనిపిస్తోంది. అబిడ్స్‌లో మొన్న బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లగా.. పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఓ బాలుడి మిస్సింగ్ సంచలనంగా మారింది..

Hyderabad: బయటకు వెళితే తిరిగి, వస్తారా రారో.. హైదరాబాద్‌లో బాలుడి మిస్సింగ్ కలకలం.. ట్యూషన్‌కి వెళ్లి..
Boy Missing In Jillelaguda
Shaik Madar Saheb
|

Updated on: Aug 05, 2024 | 12:54 PM

Share

హైదరాబాద్ నగరంలో అలజడి.. పిల్లలు ఇంటినుంచి బయటకు వెళితే, తిరిగి వస్తారా రారా అన్న టెన్షన్‌ కనిపిస్తోంది. అబిడ్స్‌లో మొన్న బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లగా.. పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఓ బాలుడి మిస్సింగ్ సంచలనంగా మారింది.. హైదరాబాద్ నగరంలోని జిల్లెలగూడలో మహీధర్‌ రెడ్డి అనే బాలుడి మిస్సింగ్‌ కలకలం రేకెత్తిస్తోంది. 8వ తరగతి చదువుతోన్న మహీధర్‌రెడ్డి నిన్న ట్యూషన్‌కు వెళ్లాడు, కానీ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కలవరపడ్డారు. ఆచూకీ ఎక్కడ కూడా లభించకపోవడంతో.. మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు బాలుడి ఆచూకీని ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సీసీ టీవీ ఫుటేజ్‌లో బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో టూవీలర్‌ మీద తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించి పోలీసులు విచారించారు. తానూ కేవలం లిఫ్ట్‌ అడిగితే ఇచ్చానని చెప్పాడు.. బాలుడిని డ్రాప్‌ చేసిన ప్లేస్ కూడా పోలీసులకు చూపించాడు. దీంతో పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు.. బైక్ ఎక్కి, మీర్పేట్ క్రాస్ రోడ్డు వద్ద బాలుడు దిగినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో బాలుడు బైక్ నుండి దిగుతున్న దృశ్యాలను గుర్తించారు. మీర్పేట్ క్రాస్ రోడ్ నుంచి బాలుడు ఆచూకీ లభించలేదు.. దీంతో మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు..

అయితే.. మరి బాలుడు ఏమైయ్యాడు? జిల్లెలగూడ పరిసరాల్లోని అన్ని సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. టిల్లు, అలియాస్‌ మహీధర్‌రెడ్డి కోసం జల్లెడ పడుతున్నారు.

నిన్న మధ్యాహ్నం ట్యూషన్‌కి వెళ్లిన మహీధర్‌రెడ్డి ఆచూకీ ఇప్పటివరకూ తెలియకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..