Viral: బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
సాధారణంగా బ్యాంకుల్లో చోరీ చేసేందుకు ఆరితేరిన దొంగలు ప్రయత్నిస్తుంటారు... మరి బ్యాంకును కొల్లగొట్టాలంటే మామూలు విషయం కాదుకదా... పక్కాగా ప్లాన్ వేయాలి. అలా పక్కా ప్లాన్‌తో చోరీకి యత్నించిన మహిళకు ఊహించని షాక్‌తో ఉసూరుమంటూ వెనుదిరిగింది. ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఆ మహిళా దొంగ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
సాధారణంగా బ్యాంకుల్లో చోరీ చేసేందుకు ఆరితేరిన దొంగలు ప్రయత్నిస్తుంటారు… మరి బ్యాంకును కొల్లగొట్టాలంటే మామూలు విషయం కాదుకదా.. పక్కాగా ప్లాన్ వేయాలి. అలా పక్కా ప్లాన్‌తో చోరీకి యత్నించిన మహిళకు ఊహించని షాక్‌తో ఉసూరుమంటూ వెనుదిరిగింది. ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఆ మహిళా దొంగ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రకాశంజిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలోని యూనియన్ బ్యాంకులో ఓ మహిళ చోరీకి విఫలయత్నం చేసింది. తనతో పాటు ఓ మగమనిషిని వెంట తెచ్చుకుంది. తొలుత వీరిద్దరూ బ్యాంక్ షట్టర్ తాళం పగల కొట్టారు. అనంతరం ఆ వ్యక్తి బ్యాంక్ బయట కాపలా ఉండగా మహిళ లోపలకు వెళ్ళింది. ముందుగా బ్యాంక్ లోపల సిసి కెమెరా వైర్ ను కట్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ, కెమెరా పక్కనే ఉన్న ఎదో వైర్ ని కట్ చేసి ఇక తన పని మొదలుపెట్టింది. లాకర్ దగ్గరకు వెళ్ళి తెరిచేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎంతకి బ్యాంక్ లాకర్ తెరుచుకోక పోవటంతో మూడు గంటల పాటు బ్యాంక్ లోపల కాలు కాలిన పిల్లిలా కలియతిరిగింది. చివరకు చేసేది ఏమి లేక ఉత్త చేతులతో బయటకు వెళ్లి పోయింది. ఉదయం షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, ఆ తరువాత పోలీస్ లకు ఫిర్యాదు చెశారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. బ్యాంక్ లో ఎలాంటి సొత్తు అపహరణకు గురి కాక పోవడంతో బ్యాంక్ అధికారులు, ఖాతా దారులు ఊపిరి పీల్చు కున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.