Telangana Rains: వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

Telangana Rains: వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

Anil kumar poka

|

Updated on: Aug 06, 2024 | 9:19 AM

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ పరిసర ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయవ్యదిశగా కదులుతోందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ పరిసర ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయవ్యదిశగా కదులుతోందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

జనగాం, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్..హనుమకొండ ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, కొత్తగూడెం, మెదక్, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెండ, వరంగల్, హన్మకొంద, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు ఏపీలోనూ అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Aug 06, 2024 09:19 AM